అమెరికాలో ఓ మహిళ ఫాదర్స్ డే గిఫ్ట్ ఏమిచ్చిందో తెలుసా..!!!  

American Girl Gives A Life Gift To Her Father For Father\'s Day -

ఈరోజు ఫాదర్స్ డే.అందరూ తమ నాన్న కి గ్రీటింగ్స్ చెప్తారు, చాక్లెట్స్, గిఫ్ట్ లు ఇస్తారు.

American Girl Gives A Life Gift To Her Father For Father's Day

హడావిడి చేసి ఫేస్ బుక్ లలో పోస్టింగ్ లతో హడావిడి హడావిడి చేస్తారు.అయితే అమెరికాలో ఓ మహిళ తన తండ్రికి పునర్జన్మ ని ఇచ్చింది.

తన పుట్టుకకి కారణం అయిన తండ్రికి ఈ మాత్రం సాయం చేయలేమా ఇది నా దృష్టిలో చాలా చిన్న సాయమే అంటూ సమాధానం చెప్పింది.ఇప్పుడు అమెరికాలో ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది.

అమెరికాలో ఓ మహిళ ఫాదర్స్ డే గిఫ్ట్ ఏమిచ్చిందో తెలుసా..-General-Telugu-Telugu Tollywood Photo Image

ఇంతకీ ఆమె తన తండ్రికోసం ఏమి చేసింది అనే వివరాలలోకి వెళ్తే.

అమెరికాలోని టెక్సాస్ కి చెందిన టేలర్ ట్రీట్ట్ అనే మహిళ తండ్రిని అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేర్చింది.తన తండ్రికి ఉన్న రెండు కిద్నీలలో ఒకటి పాదయ్యిందని వైద్యుల ద్వారా తెలుసుకుంది.అంతేకాదు తన తండ్రికి త్వరగా కిడ్నీ మార్చకపోతే ప్రాణాపాయం అని తెలుసుకుంది.

దాంతో ఒక్క నిమిషం కూడా లోచించ కుండా తన కిడ్నీ ఇస్తానని వైద్యులకి తెలిపింది.

ఆమె ఇష్టానుసారంగా ఆమెకి వైద్య పరీక్షలు చేసి తన కిడ్నీలు పని చేస్తాయని చెప్పడంతో ఆమె సంతోషానికి అవధులు లేవు.

తన పుట్టుకకి కారణం అయిన తండ్రికి పునర్జనం ఇవ్వడం అనే అవకాశం నాకు వచ్చినందుకు సంతోషిస్తున్నాను అంటూ తెలిపింది.ఫాదర్స్ డే రోజునే తన తండ్రికి ఆమె కిడ్నీ దానం చేయడంతో ఆమె సాహసాన్ని, ప్రేమని ప్రపంచం మొత్తం మెచ్చుకుంటోంది.

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు