అమెరికా అమ్మాయి.. ఆఫ్రికా అబ్బాయి.. ఇండియా వ‌చ్చి చివ‌ర‌కు

American Girl African Boy Come To India And Infected With Omicron

ప్ర‌పంచాన్ని ఇప్పుడు క‌ల‌వ‌ర పెడుతున్న క‌రోనా వైర‌స్‌లో అతి భయంక‌ర‌మైన వేరియంట్ గా పేరు తెచ్చుకుంది ఒమిక్రాన్‌.ద‌క్షిణాఫ్రికాలో పుట్టిన ఈ వైర‌స్ ఇప్పుడు ప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డ‌లాడిస్తోంది.ఆఫ్రికా పేరు చెబితేనే ప్ర‌పంచ దేశాలు వ‌ణికిపోతున్నాయి.వ్యాక్సిన్లు వేస‌కున్నా కూడా దాని మీద పెద్ద‌గా ప్ర‌భావం చూపించ‌ట్లేద‌నే వాద‌న కూడా వినిపిస్తోంది.దీంతో అంద‌రిలోనూ ఒకింత భ‌యం పెరిగిపోయింది.కాగా ఇప్పుడు ఈ మ‌హమ్మారి మ‌న ఇండియాలోకి కూడా అడుగు పెట్టింది.

 American Girl African Boy Come To India And Infected With Omicron-TeluguStop.com

ఇప్ప‌టికే చాలా కేసులు న‌మోద‌వుతున్నాయి.

ఈ ఒమిక్రాన్ కేసుల్లో ఇప్పుడు ఓ విచిత్ర‌మైన కేసు వెలుగులోకి వ‌చ్చింది.

 American Girl African Boy Come To India And Infected With Omicron-అమెరికా అమ్మాయి.. ఆఫ్రికా అబ్బాయి.. ఇండియా వ‌చ్చి చివ‌ర‌కు-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అమెరికాకు చెందిన ఓ అమ్మాయి ద‌క్షిణాఫ్రికాలోని జోహ‌న్న‌స్ బ‌ర్గ్‌కు చెందిన అబ్బాయిని ప్రేమించింది.అయితే ఆ అబ్బాయి రీసెంట్ గా మ‌హారాష్ట్ర రాజ‌ధాని ముంబ‌యికి వ‌చ్చాడు.

ఇక అత‌ని కోసం ఆ అమ్మాయి కూడా ఇండియాకు వ‌చ్చింది.ఇలా వ‌చ్చిన వీరిద్ద‌రికీ కరోనా టెస్ట్ చేయ‌గా.ఇద్ద‌రి శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్స్ టెస్ట్ కోసం పంప‌గా.ఇద్ద‌రికీ ఒమిక్రాన్ వేరియంట్ సోకిన‌ట్టు తెలిపారు డాక్ట‌ర్లు.ఈ ఈ ఇద్ద‌రితో క‌లిపి ఇప్ప‌టి వ‌ర‌కు మహారాష్ట్రలో 10 ఒమిక్రాన్ కేసులు న‌మోద‌య్యాయి.

Telugu America, Carona, Corona, Genom Sequence, India, Omicran, Omicron, Pfizer Vaccine, Hills, Africa Boy, Vaccine-Latest News - Telugu

ఇక్క‌డ మ‌రో విష‌యం ఏంటంటే ఈ ఇద్ద‌రిలో ముందుగా అబ్బాయికి క‌రోనా సోక‌గా.ఆ త‌ర్వాత అత‌న్ని క‌లిసిన అమ్మాయికి కూడా సోకింది.ఇద్ద‌రిలోనూ ఎలాంటి ల‌క్ష‌ణాలు క‌నిపించ‌ట్లేదు.

ఈ ఇద్ద‌రినీ అధికారులు సెవెన్ హిల్స్ హాస్పిట‌ల్ లో చేర్పించారు.ఇక వీరిద్ద‌రూ కూడా ఫైజర్ టీకాను రెండు డోసులు తీసుకున్నారు.

వీరిని ఇంకెవ‌రైనా క‌లిశారా అనే విష‌యం మీద కూడా అధికారులు ఎంక్వ‌యిరీ చేస్తున్నారు.ఇక హై రిస్క్ దేశాల నుండి ఎవ‌రు వ‌చ్చినా స‌రే ఖచ్చితంగా టెస్టు చేయాల‌ని, అలాగే టెస్ట్ ట్రాక్ నిర్వ‌హించాల‌ని అధికారులు నిర్ణ‌యించారు.

#India #Omicron #Pfizer Vaccine #Africa Boy #America

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube