కాలిఫోర్నియా: తోటి ఆటగాడిపై వేధింపులు.. ఫుట్‌బాల్ సీజన్ రద్దు

కాలిఫోర్నియాకు చెందిన ఒక హైస్కూలు తన ఫుట్‌బాల్ సీజన్‌ను రద్దు చేసింది.ఒక ఆటగాడిపై జట్టు సభ్యుల్లో కొందరు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో స్కూలు యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది.

 American Gilroyhigh Schoolcancels Footballseason-TeluguStop.com

2019 ఫుట్‌బాల్ సీజన్‌ షెడ్యూల్‌ను పూర్తిచేయాలనే షెడ్యూల్‌కు గిల్‌రాయ్ హైస్కూల్ కట్టుబడి ఉంది.అయితే ఫుట్‌బాల్ జట్టులోని కొందరు ఆటగాళ్లు ఈ సీజన్‌ను పూర్తి చేయకూడదని కోరుతున్నందున 2019 ఫుట్‌బాల్ సీజన్ ఇక కొనసాగదని గిల్‌రాయ్ యూనిఫైడ్ స్కూల్ డిస్ట్రిక్ట్ ఒక ప్రకటనలో తెలిపింది.

Telugu Football Season, Gilroy School, Assault, Telugu Nri Ups-

గత వారం ప్రాక్టీస్ ముగిసిన తర్వాత లాకర్ రూంలోకి ప్రవేశించిన నలుగురు విద్యార్ధులు మరో విద్యార్ధిపై దాడి చేయడంతో పాటు లైంగిక వేధింపులకు గురిచేశారు.దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్కూలు యాజమాన్యం ఘటనకు బాధ్యులైన నలుగురిని సస్పెండ్ చేయడంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేసింది.కేసు నమోదు చేసుకున్న పోలీసులు సెప్టెంబర్ 26 నుంచి దర్యాప్తు ప్రారంభించారు.అయితే విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా వారిని విచారించాలా వద్దా అన్నది నిర్థారించడానికి శాంటా క్లారా కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ జనరల్ కార్యాలయం ఆధారాలను సమీక్షిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube