నాటు నాటు పాటకు అమెరికన్ అభిమానుల డ్యాన్స్.. వీడియో వైరల్!

తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ దర్శక దీరుడు ఎస్ఎస్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.బాహుబలి సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి అదే క్రేజ్ తో ఆర్ఆర్ఆర్ సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే.

 American Fans Mesmerise With Rrr Movie They Shakes Leg For The Song Naatu Naatu-TeluguStop.com

ఈ రెండు సినిమాలతో భారతీయ సినిమాల ఖ్యాతిని ప్రపంచం మొత్తానికి చాటి చెప్పాడు రాజమౌళి.అంతే కాకుండా తెలుగు సినీ ఇండస్ట్రీలో ఓటమి ఎరుగని దర్శకుడిగా దూసుకుపోతున్నారు.

కాగా రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన చిత్రం ఆర్ఆర్ఆర్.

 American Fans Mesmerise With Rrr Movie They Shakes Leg For The Song Naatu Naatu-TeluguStop.com

భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా లెవెల్లో విడుదలైన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా 1200 కోట్లకు పైగా కలెక్షన్స్ ను రాబట్టింది.

కాగా ప్రస్తుతం ఈ సినిమా హిందీ వర్షన్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.ఈ సినిమాని చూసిన ప్రతి ఒక్కరు కూడా సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఇద్దరు హీరోలతో పాటు దర్శకుడు రాజమౌళి నీ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.ఇకపోతే గత కొద్ది రోజులుగా ఆర్ఆర్ఆర్ సినిమా నామినేషన్ అవ్వకపోవడం పట్ల పలు రకాల వార్తల వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

ఆస్కార్ కీ ఆర్ఆర్ఆర్ సినిమా ఎంపిక అవ్వకపోవడం పట్ల అభిమానులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు.అయినా కూడా ఈ సినిమా క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు.

ఇది ఇలా ఉంటే తాజాగా హాలీవుడ్ ఫిలిం ఫెస్టివల్ బియాండ్ ఫెస్ట్ ను నిర్వహించారు.ఈ క్రమంలోనే ఆర్ఆర్ఆర్ సినిమా తెలుగు వర్షన్ లాస్ ఏంజిల్స్ లో ఐమాక్స్ లో ప్రదర్శించారు.ప్రముఖ టిసిఎల్ చైనీస్ థియేటర్ లో స్కీనింగ్ ఏర్పాటు చేశారు.ఇక ఈ సినిమాకు విదేశీయుల నుంచి అనూహ్యమైన స్పందన లభించింది.థియేటర్ మొత్తం చెప్పట్లతో మారు మోగిపోయింది.కొంతమంది అయితే స్క్రీన్ ముందుకు వెళ్లి మరి డాన్స్ చేశారు.

అంతేకాకుండా ఈ సినిమా చూసిన వారందరూ కూడా దర్శకుడు రాజమౌళికి స్టాండింగ్ ఓవియేషన్ ఇచ్చారు.ఇందుకు సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

నాటు నాటు పాట వస్తున్నప్పుడు కొంతమంది స్క్రీన్ ముందుకు వెళ్లి మరి డాన్సులు వేశారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube