భారత్‌లో ప్రవేశించనున్న అమెరికన్ ఎలక్ట్రిక్ వాహనాల సంస్థ ‘‘ఫిస్కర్’’... !!

ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు ఊపందుకుంటున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలోనే దిగ్గజ ఆటోమొబైల్ సంస్థల చూపు భారత్‌పై పడింది.140 కోట్ల జనాభా, ప్రజల కొనుగోలు శక్తి, ప్రబల ఆర్ధిక వ్యవస్థగా ఎదుగుతుండటం తదితర కారణాలతో భారత్‌లో జెండా పాతాలని ఎన్నో సంస్థలు ప్రణాళికలు రూపొందించుకుంటున్నాయి.ఇప్పటికే ఎలాన్ మస్క్ సారథ్యంలోని టెస్లా’భారత్‌లో ప్రవేశించాలని ఎంతగానో ప్రయత్నించింది.

 American Ev Maker Fisker Announces To Enter India , American,  Ev Maker,  Fisker-TeluguStop.com

కానీ ఇక్కడి కఠినమైన నిబంధనల కారణంగా టెస్లాకు ఛాన్స్ దొరకడం లేదు.ఈ క్రమంలో అమెరికాకే చెందిన మరో ఎలక్ట్రిక్ వాహనాల దిగ్గజం ఫిస్కర్ భారత్‌లో ప్రవేశిస్తున్నట్లుగా ప్రకటించింది.

ఈ సంస్థ వచ్చే ఏడాది జూలైలో భారత్‌లో తన ఓషన్ ఎలక్ట్రిక్ స్పోర్ట్- యూటిలిటీ వెహికల్‌ని విక్రయించడం ప్రారంభించనుంది.అలాగే రాబోయే రోజుల్లో భారత్‌లోనే తయారీని ప్రారంభిస్తామని ఈ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ హెన్రీక్ ఫిస్కర్ రాయిటర్స్ వార్తాసంస్థకు తెలిపారు.

భారత్‌లో ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు 2025-26 నాటికి మరింత ఊపందుకుంటాని ఆయన జోస్యం చెప్పారు.ఏది ఏమైనా భారత్ పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాల వైపే వెళ్తుందని ఫిస్కర్ అన్నారు.

అయితే అది అమెరికా, చైనా, యూరప్‌లతో పోలిస్తే మందకొడిగా వుండవచ్చన్నారు.

Telugu America, American, China, Electricsport, Europe, Ev Maker, Fisker, India,

భారతదేశంలో ప్రతి ఏడాది మూడు మిలియన్ల కార్లు విక్రయించబడితే అందులో ఎలక్ట్రిక్ కార్ల వాటా కేవలం 1 శాతం మాత్రమే.తగినంత ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు, అధిక బ్యాటరీ ఖర్చుల కారణంగా ఈ రంగంలో వృద్ధి నమోదు కావడం లేదని ఆర్ధిక వేత్తలు అంటున్నారు.అయితే 2030 నాటికి ఈ వాటాను 30 శాతానికి పెంచాలని భావిస్తోన్న ప్రభుత్వం.

ఈవీలు, దాని అనుబంధ భాగాలను స్థానికంగానే ఉత్పత్తి చేసే వారికి బిలియన్ డాలర్ల ప్రోత్సాహకాలను అందిస్తోంది.ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తిలో ఫిస్కర్‌కు ప్రధాన ప్రత్యర్ధిగా వున్న టెస్లా అత్యల్ప స్థాయిలో దిగుమతి సుంకం పొందడంలో విఫలమైనందున భారత్‌లో దాని ప్రవేశ, విస్తరణ ప్రణాళికలను నిలిపివేసింది.

స్థానికంగా తయారు చేసేముందు మార్కెట్‌ను పరిశీలించేందుకు గాను తొలుత భారత్‌లో దిగుమతికే టెస్లా మొగ్గు చూపిందని, కానీ అది చాలా ఖరీదైన వ్యవహారంగా ఫిస్కర్ అన్నారు.అయితే తాము దిగుమతుల కోసం సముద్రాన్ని వినియోగించుకుని.

తక్కువ ధరకు కార్లను అందుబాటులో వుంచుతామని ఫిస్కర్ పేర్కొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube