అమెరికాలో ఎంతో మంది మేధావులు ఉన్నారు.ఎంతో మంది ఉన్నత విద్యలని అభ్యసించి గౌరవ పట్టాలు పొందుతున్న వారు కూడా ఉన్నారు అయితే.
తాజాగా న్యూయార్క్ లో జరిగిన సంఘన వింటే షాక్ అవుతారు అదేంటంటే.ఒక శునకానికి సైకాలజీలో గౌరవ డిప్లొమో ఇవ్వడమే ఏంటి షాక్ అయ్యారా.
వివరాలలోకి వెళ్తే.
ఆ కుక్క పేరు గ్రిఫిన్.బ్రిటనీ హాలీ అనే అమ్మాయికి ఎప్పుడూ తోడుగా ఉంటుంది.అయితే ఆమె తాజాగా న్యూయార్క్‌లోని క్లార్క్సన్ యూనివర్సిటీ నుంచి సైకాలజీలో ఆక్యుపేషనల్ థెరపీ స్పెషల్ సబ్జెక్టుగా మాస్టర్స్ డిగ్రీ అందుకుంది.
ఆమెతో పాటు గ్రిఫిన్‌కు కూడా గౌరవ డిప్లొమా ప్రదానం చేశారు…ఎందుకంటే బ్రిటనీకి చేదోడువాదోడుగా ఉటూ పేషంట్ల చికిత్సలో తోడ్పాటు అందించడంలో గ్రిఫిన్ అనే ఆ శునకం తర్ఫీదు పొందడమే.
తాను ఏమి నేర్చుకుందో అవన్నీ తన కుక్క సారీ గ్రిఫిన్ కూడా నేర్చుకుందని అందుకే తన పేరుని నేనే సిఫార్స్ చేశానని ఆమె తెలిపింది.నార్త్ కరోలినాలోని విల్సన్‌కు చెందిన బ్రిటనీ ఆ చక్రాల కుర్చీ లేకపోతే ఎటూ కదలలేని పరిస్థితి దాంతో ఆమెకు నిరంతరం ఎవరో ఒకరు వెన్నంటే ఉండాలని ఆమెకి తోడుగా గ్రిఫిన్ ని ఉంచారు.సెల్ ఫోన్ తెచ్చివ్వడం దగ్గర నుంచి ఏది కావాలన్నా అందిస్తుంది.
లేజర్‌తో బ్రిటనీ దేనిని చూపిస్తే దానిని టక్కున తీసుకు రావడం ,తలుపులు తెరవడం, లైట్లు వేయడం లాంటి పనులు చేస్తుందట.