అమెరికా కుక్కా... మాజాకానా..విషయం తెలిస్తే నోరెళ్లబెడుతారు..

ఏ దేశంలోనైన జంతు ప్రేమికుల ఇళ్ళలో ఎక్కువగా పెంచుకునే పెంపుడు జంతువు కుక్క.కొన్ని కుక్కలు చెప్పిన పనులన్నీ చేస్తూ, కావాల్సినవన్నీ తెచ్చి పెడుతూ తెగ పనులు చేసేస్తుంటాయి.

 American Dog Doing Silly Activities In Training Center-TeluguStop.com

మనదేశంలో ఇలాంటివి అరుదుగా చూస్తాము కాని, విదేశాలలో పెంపుడు కుక్కలు అన్ని పనులు చేసేలా ట్రైనింగ్ ఇస్తారు.విదేశాలలో కుక్కలకు ఈ విధంగా ట్రైనింగ్ ఇవ్వడానికి ట్రైనింగ్ సెంటర్లు కూడా ఉంటాయి.

అయితే.

అమెరికాలోని కెంటకీలో ‘డబుల్ హెచ్ కెనైన్’ అనే ట్రైనింగ్ సెంటర్ కు శిక్షణ కోసం వెళ్ళిన రైకర్ అనే శునకం అక్కడి సిబ్బందిని ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్ళు తాగించింది.చెప్పిన పని చేయకపోగా ఇంకో పని చేసి అక్కడి ట్రైనర్స్ కు తలనొప్పి తెప్పించిందట.జర్మన్ షపార్డ్ జాతికి చెందిన ఈ శునకానికి ట్రైనింగ్ సమయంలో పనులు చేయాలన్న ఆరాటమే తప్ప ఏ ఒక్కటి సరిగా చేసేది కాదట.

శిక్షణా క్రమంలో.

ఫ్రిజ్ డోర్ తెరవమంటే, ఫ్రిజ్ నే జరిపేయడం, బాల్ విసిరేసి తిసుకురంమంటే, పరుగెత్తే క్రమంలో యజమానికి కిందకి పడేసి వెళ్ళడం ఇలా అది చేసే ప్రతీ పని నవ్వుతెప్పించింది.ఇవన్ని ఆ ట్రైనింగ్ సెంటర్ వారు సోషల్ మీడియాలో పెట్టగా, అది కాస్తా వైరల్ అయ్యింది.విచిత్రం ఏమిటంటే ఇదే రైకర్ ఇంకో వీడియోలో అన్ని పనులు సక్రమంగా చేస్తూ అందరి ప్రశంసలు అందుకుంది.

ఇది చూసిన నెటిజన్లు ఎట్టకేలకు దాని సాయిశాక్తులా ప్రయత్నించి పనులు నేర్చుకుంది అని కామెంట్లు పెడుతున్నారు.పాపం ఇంత అల్లరి శునకానికి శిక్షణ ఇవ్వడానికి ఆ ట్రైనర్లు ఎన్ని కష్టాలు పడి ఉంటారో…

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube