అమెరికా వైద్యుల సంచలన ప్రకటన...ఆందోళనలో అమెరికన్స్..!!!

అగ్ర రాజ్యం అమెరికాలో కరోన వైరస్ ప్రభావం కొనసాగుతూనే ఉంది. కరోనా కేసుల సంఖ్య నానాటికి పెరుగుతున్నా అమెరికాలోని పలు ప్రాంతాలలో లాక్ డౌన్ ఎత్తివేయడంతో పరిస్థితి పూర్తిగా అదుపుతప్పిందనే చెప్పాలి.ఇప్పటి వరకూ సుమారు 25 లక్షలకి పైగా ప్రజలు కరోనా వైరస్ బారిన పడగా దాదాపు 1.20 లక్షల మందికి పైగా అమెరికన్స్ ప్రాణాలు కోల్పోయారు.ఒక వైపు ప్రజలు కరోనాతో పోరాటం చేస్తూనే ఆర్ధిక పరిస్థితులని ఎదుర్కుంటూ ఎన్నో అవస్థలు పడుతున్నారు.

 Corona Cases, America, Corona Cases Increased, Doctors, American Doctors-TeluguStop.com

ఈ క్రమంలోనే అమెరికా కీలక వైద్య నిపుణులు ఓ సంచలన ప్రకటన చేశారు.

ఇప్పటి వరకూ కరోనా కేసులు నమోదు అయినవి కేవలం 25 లక్షలు అని రానున్న రోజుల్లో ఈ కేసుల సంఖ్య భవిష్యత్తులో బాధితుల సంఖ్య ఇప్పుడు ఉన్న సంఖ్య కంటే కూడా 10 రెట్లు ఎక్కుగా కేసులు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రస్తుతం అమెరికాలో తమ అంచనాల ప్రకారం కరోన కేసుల సంఖ్య దాదాపు 2 కోట్లకి ఉంటాయని వైద్య నిపుణులు అంటున్నారు.

లక్షలాది మంది వారికి తెలియకుండానే కారోనా బారిన పడుతున్నారని అందుకు కారణం లాక్ డౌన్ ఎత్తివేయడమేనని ధ్వజమెత్తుతున్నారు.

ఇదిలాఉంటే కరోనా టెస్ట్ ల సమయంలో వారికి ఎదురవుతున్న ఇబ్బంది కర పరిస్థితుల కారణంగా ఎవరూ టెస్ట్ లు చేయించుకోవడానికి బయటకి రావడం లేదని ఈ కారణంగా అమెరికా జనాభాలో సుమారు 6 శాతం మంది కరోనా బారిన పడ్డారని అంచనా వేస్తున్నారు.కొత్తగా నమోదు అయ్యే ప్రతీ కేసుతో సుమారు 25 మందికి ఈ వైరస్ సోకే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube