ఐపీఎల్ 2020 లో ఆడబోతున్న అమెరికా క్రికెటర్…!  

KKR Team Welcomes American Cricketer Ali Khan, American Cricketer Ali Khan, KKR Team, Twitter, IPL2020 - Telugu American Cricketer Ali Khan, Ipl 2020, Ipl2020, Kkr, Kkr Team, Kkr Team Welcomes American Cricketer Ali Khan, Knigt Riders, Twitter, Uae

భారతదేశంలో ప్రతి సంవత్సరం నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఈ సంవత్సరం కరోనా వైరస్ నేపథ్యంలో అసలు జరుగుతుందో లేదో అన్న పరిస్థితుల నడుమ ఎట్టకేలకు యూఏఈ దేశంలో పూర్తి ఐపీఎల్ ను నిర్వహించబోతున్నారు.సెప్టెంబర్ 19 నుండి ఐపీఎల్ 2020 సీజన్ మొదలు కాబోతోంది.

TeluguStop.com - American Cricketer Ali Khan Ipl2020 Kkr

ఇప్పటికే అన్ని జట్ల క్రీడాకారులు క్రమక్రమంగా దుబాయ్ కి చేరుకుంటున్నారు.ఇప్పటికే చాలా మంది క్రీడాకారులు యూఏఈ కి చేరుకొని అక్కడ క్వారంటైన్ సమయాన్ని కూడా పూర్తి చేసుకున్నారు.

ఇలా పూర్తి చేసుకున్న ఆటగాళ్ళు ప్రాక్టీస్ లో పాల్గొంటున్నారు కూడా.ఇక ఇదే క్రమంలో కొత్త క్రికెటర్ అలీ ఖాన్ కూడా చేరాడు.కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు తో ఆయన జతకలిశాడు.నిజానికి అలీ ఖాన్ ఓ ప్రత్యేకమైన ఆటగాడని చెప్పవచ్చు.

TeluguStop.com - ఐపీఎల్ 2020 లో ఆడబోతున్న అమెరికా క్రికెటర్…-General-Telugu-Telugu Tollywood Photo Image

ఎందుకంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఆడుతున్న తొలి అమెరికా క్రికెటర్ అలీ ఖాన్.ఈ విషయాన్ని కేకేఆర్ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపింది.

ఇకపోతే అమెరికా క్రికెటర్ అలీ ఖాన్ కు కోల్ కతా నైట్ రైడర్స్ ప్రధాన కోచ్ బ్రెండన్ వెల్కమ్ కూడా ఘన స్వాగతం తెలిపారు.వెల్కమ్ అలీఖాన్ టీం టిభాగో నైట్ రైడర్స్ తరఫున కూడా టైటిల్ సాధించారు.

కోల్ కతా నైట్ రైడర్స్ జట్టులో చోటుకి నువ్వు పూర్తి అర్హుడు అంటూ వెల్కమ్ ట్వీట్ చేశాడు.ఇకపోతే తాజాగా జరిగిన కరేబియన్ ప్రీమియర్ లీగ్ ఛాంపియన్స్ ట్రోఫీలో గెలిచిన జట్టు సభ్యులలో అలీఖాన్ కూడా ఒక్కడు.

ప్రస్తుతం అదే ఉత్సాహంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ కూడా ఆడేందుకు దుబాయ్ కి చేరుకున్నారు.ఇక కోల్ కతా నైట్ రైడర్స్ సెప్టెంబర్ 23న అబుదాబి వేదికగా ముంబై ఇండియన్స్ తన మొదటి మ్యాచ్ ను ఆడబోతోంది.

#KKRTeam #Knigt Riders #Twitter #Ipl 2020 #IPL2020

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

American Cricketer Ali Khan Ipl2020 Kkr Related Telugu News,Photos/Pics,Images..