అమెరికాలో కరోనా శాడిస్ట్..ఉతికి ఆరేసిన నెటిజన్లు..!!  

American Corona Patient Spit On Grocery - Telugu America, Corona Patient, Corona Patient Spit On Grocery, Corona Virus, Super Market

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది.ప్రపంచ వ్యాప్తంగా వేలాది మంది ప్రజలు మృతి చెందారు,లక్షలాది మంది కరోనా పాజిటివ్ రావడంతో చికిత్స పొందుతున్నారు.

 American Corona Patient Spit On Grocery

అమెరికాలో ఈ పరిస్థితి మరీ ఘోరంగా తయారయ్యింది.న్యూయార్క్ సిటీ శ్మశాన దిబ్బలుగా మారిపోయాయి.

ఎంతో మంది పేద ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు.ఈ పరిస్థితి కరోనా ప్రభావం చూపిన అన్ని దేశాలలో కనిపిస్తూనే ఉంది.

అమెరికాలో కరోనా శాడిస్ట్..ఉతికి ఆరేసిన నెటిజన్లు..-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఇదిలాఉంటే తాజాగా అమెరికాలో జరిగిన ఓ సంఘటన అమెరికన్స్ ని పరుగులు పెట్టేలా చేసింది.

అమెరికాలోని మాసెచుసెట్స్ లోని ఓ సూపర్ మార్కెట్ కి వెళ్ళిన ఓ వృద్దుడు అక్కడ ఉన్న వస్తువులు, సరుకుల వద్దకి వెళ్లి తుమ్మడం మొదలు పెట్టాడు, అలాగే ఒక్క సారిగా దగ్గుతూ వాటిపై ఉమ్ము వేశాడు.ఇది గమనిచిన ఓ మహిళ వెంటనే అరుస్తూ అందరికి చెప్తూ పరుగులు పెట్టింది.దాంతో ఒక్క సారిగా అలెర్ట్ అయిన షాపు సిబ్బంది, ప్రజలు కలిసి ఆ వృద్దుడిని కింద పడేసి చేతులు వెనక్కి పెట్టి కట్టేశారు.

పోలీసులకి సంచారం అందించిన షాపు యజమాని నిందితుడిని పోలీసులకి అప్పగించాడు.అయితే నిందితుడికి కరోనా ఉందా లేదా అనే విషయం పై వైద్యులని సంప్రదించామని అన్నారు.సూపర్ మార్కెట్ లో ఆస్తుల ధ్వంసం మరియు ఉత్పత్తులపై ఉమ్మి వేసినందుకు గాని అతడిపై కేసులు నమోదు చేశామని ఎవరైనా ఇకపై ఇలాంటి తప్పిదాలకి పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.