అమెరికాలో రాజా..కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షుడుగా...!!!  

American Congress New President Is Hirsh Singh-

అమెరికాలో ఆర్ధిక వినియోగ దారుల విధానాల కోసం ఉండే ఓ కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షుడిగా భారత సంతతి వ్యక్తి అయిన రాజా కృష్ణ మూర్తి నియమిపబడ్డారు. ఈ నియామకంతో ఆయన అరుదైన ఘనత సంపాదించారు. ఈ ఘనత సాధించిన మొదటి దక్షిణాసియా వాసిగా ఆయన రికార్డ్ సృష్టించారు..

అమెరికాలో రాజా..కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షుడుగా...!!!-American Congress New President Is Hirsh Singh

ఇప్పటి వరకూ అమెరికాలో ఏ భారతీయుడికి ఇటువంటి ఘటన దక్కలేదని స్థానిక మీడియా తెలిపింది. ఢిల్లీ లో తమిళ కుటుంభంలో జనించిన ఆయన తరువాత తన కుటుంభం అమెరికా వెళ్లి సెటిల్ అవ్వడంతో ఆయన విద్యాభ్యాసం మొత్తం అమెరికాలోనే జరిగింది. జోన్ బీ గొట్షాల్ అనే సంస్థలో లా క్లర్క్‌గా ఉద్యోగ జీవితం ప్రారంభించారు.

ఆ తరువాత 2000వ సంవత్సరంలో బరాక్ ఒబామా ఎన్నికల ప్రచారానికి స్టాఫర్‌గా చేశారు. 2004లోనూ ఒబామా గెలుపులో కీలక పాత్ర పోషించిన ఆయన కిర్క్‌లాండ్ అండ్ ఎల్లీస్‌ సంస్థలో కీలక భాగస్వామిగా ఉన్నారు. ఇలా పలు రంగాలలో కీలక భాద్యతలు చేపట్టిన ఆయనకి కాంగ్రెస్ ఆర్ధిక విభాగంలో కీలక పదవిని కట్టబెట్టడం ఎంతో మంచి పరిణామని అమెరికా మీడియా సైతం ప్రచురించడం గమనార్హం.