భారత్ పై ఆరోపణలు చేసిన వాల్ మార్ట్  

American Company Walmart Comment On Indian Government To America-telugu Nri News Updates,telugu Viral News Updates,walmart

ఎక్కడో అమెరికా లో ఉన్న మల్టీనేషనల్ రిటెయిల్ కార్పొరేషన్ వాల్ మార్ట్ ఇండియా పై ఆరోపణలు చేసింది. ఈ-కామర్స్ కు సంబంధించి భారత నూతన పెట్టుబడి నిబంధనలు కఠినతరంగా ఉన్నాయని, తమ వాణిజ్య సంబంధాలను దెబ్బ తీసేవిగా ఉన్నాయంటూ అగ్రరాజ్యం అమెరికాకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది. ఇప్పటికే భారత్-అమెరికా దేశాల మధ్య టారిఫ్ వార్ ఓ వైపు సాగుతుండగా దానికి ఆజ్యం పోస్తూ వాల్ మార్ట్ ఈ సరికొత్త ఆరోపణలు చేసింది..

భారత్ పై ఆరోపణలు చేసిన వాల్ మార్ట్ -American Company Walmart Comment On Indian Government To America

అయితే వాస్తవానికి గత జనవరిలోనే ఫిర్యాదు చేసినప్పటికీ తాజాగా ఇందుకు సంబంధించిన డాక్యుమెంటును రాయిటర్స్ కు అందజేయడం తో ఇప్పుడు ఈ అంశం మరోసారి చర్చనీయాంశమైంది. ఇండియా ఈ ఏడాది ఫిబ్రవరి 1 నుంచి సరికొత్త టారిఫ్ నిబంధనలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అమెరికా నుంచి దిగుమతి చేసుకొనే 28 వస్తువుల పై సుంకాలను పెంచుతూ సరికొత్త నిబంధనలు రూపొందించడం తో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం భారత్ పై నిప్పులు గక్కారు.

అయితే ఈ విధంగా అమెరికా నుంచి దిగుమతి చేసుకొనే వస్తువులపై సుంకాలను పెంచడం తమను ఆందోళనకు గురి చేస్తోందని, ఈ-కామర్స్ రెగ్యులేషన్స్ అత్యంత హార్ష్ గా ఉన్నాయంటూ వాల్ మార్ట్ పేర్కొంది. రిటెయిల్ మార్కెట్లో వాల్ మార్ట్.

ఇండియాతో మంచి వాణిజ్య సంబంధాలను కొనసాగిస్తూ వస్తోంది. అయితే అమెరికన్ సరుకులపై భారత ప్రభుత్వం సుంకాలను పెంచడంతో దాని ప్రభావం ఈ సంస్థపై కూడా పడడం తో పై విధంగా అమెరికా కు ఫిర్యాదు చేసింది.