అమెరికాలో వింత...తోడు కోసం ఏకంగా ట్రంప్ ని హాస్పటల్ కి తీసుకువెళ్లాడు...!!!  

American Citizen Take The Trump In To Hopspital - Telugu America President Trump, Nelsan Gibson, Nelsan Gibson And Donald Trump, Trump

ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు మనం హాస్పిటల్ కి వెళ్తుంటాం.సమస్య తీవ్రతను బట్టీ మనతో పాటు స్నేహితులనో, లేక కుటుంబ సభ్యులనో తోడు తీసుకు వెళ్తాం.

American Citizen Take The Trump In To Hopspital

ఎందుకంటే మన అనుకునే వారు పక్కన ఉంటే మనకి కూడా కొంచెం ధైర్యంగా ఉంటుందని.ఏ మాత్రం సంబంధం లేని వ్యక్తులను ఎవరైనా తోడు తీసుకెళతారా.

ఇదే పని చేశాడు, అమెరికాలో ఓ వ్యక్తి.అసలు కథ ఏమిటంటే.

అమెరికాకి చెందిన ఓ వ్యక్తి హాస్పిటల్ లో తోడు కోసం ఏకంగా ట్రంప్ నే వెంట తీసుకెళ్ళిపోయాడు.నిజమేనండి ఫ్లోరిడాకు చెందినా నెల్సన్ గిబ్సన్ అనే వ్యక్తి కొంతకాలంగా కిడ్నీ సంబంధ వ్యాధితో బాధపడుతున్నాడు.

ఈ క్రమంలోనే అతను స్థానికంగా ఉన్న ఓ క్లినిక్ లో డయాలసిస్ చేయించుకోవాల్సి వచ్చింది.అయితే దానికి మూడున్నర గంటల సమయం పడుతుందని, కుటుంబ సభ్యులను కూడా అనుమతించమని ఆ క్లినిక్ వారు చెప్పారు.

దానితో ఒంటరిగా భావించిన నెల్సన్.

చికిత్స సమయంలో ఎలాంటి భావోద్వేగాలకు లోను కాకూడదని ట్రంప్ ను తోడు తెచ్చుకున్నాడు.

ఇతని కోసం ట్రంప్ ఎందుకు వస్తాడు,అసలు ఏంటి ఇదంతా అనుకుంటున్నారా.అసలు విషయం ఏమిటంటే అతను ట్రంప్ కటౌట్ ను క్లినిక్ లోకి తోడు తీసుకెళ్ళాడు.

ప్రస్తుతం సోషల్ మీడియా లో నెల్సన్ ఇలా ట్రంప్ కటౌట్ తో హాస్పిటల్ వెళ్ళిన ఫొటోస్ తెగ వైరల్ అయ్యాయి.

తాజా వార్తలు

American Citizen Take The Trump In To Hopspital-,nelsan Gibson,nelsan Gibson And Donald Trump,trump Related....