అమెరికాలో విషాదకర ఘటన..  

American Citizen Suicide Attempt-dog,old Women,park,suicide,అమెరికా,కుక్క

అమెరికాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. విశ్వాసానికి మారుపేరుగా నిల్చే కుక్క కోసం, ఏకంగా ఓ యజమాని ఆత్మహత్య కి పాల్పడ్డాడు. ఈ ఘటన అతడి కుటుంభంలో విషాదాన్ని మిగిల్చింది..

అమెరికాలో విషాదకర ఘటన..-American Citizen Suicide Attempt

ఇంతకీ ఆ కుక్కకోసం ఎందుకు యజమాని ఆత్మహత్యకి పాల్పడ్డాడనే వివరాలలోకి వెళ్తే.చాలా మంది ఇంట్లో పెంచుకునే కుక్కలని ఎంతో ప్రేమగా తమ కుటుంభ సభ్యులుగా చూస్తారు.

మరికొందరు తమ పిల్లలుగా సాకుతారు. అలంటి సమయంలో వాటికి చిన్నపాటి అనారోగ్య సమస్య వచ్చినా సరే తట్టుకోలేరు. మానసికంగా కుంగిపోతారు.

ఇలాంటి ఘటనే అమెరికాలోని ఫ్లోరిడాలో చోటు చేసుకుంది. ఆండ్రూ ఎప్ప్ అనే వ్యక్తి ఓ కుక్కను పెంచుకున్నాడు దాని పేరు జావా.ఎంతో ప్రేమగా చూసుకునే జావాని ఇటీవల ఓ పార్కులో పెద్ద మొసలి దాడి చేసింది.

ఈ దాడిలో అది తీవ్రంగా గాయపడింది. దాంతో కొన్ని రోజులకి అది చనిపోయింది. అప్పటి నుంచీ ఆండ్రూ మానసికంగా కుంగిపోయాడు దాంతో అతడిని వైద్యుల వద్దకి తీసుకువెళ్ళిన కుటుంభ సభ్యులు అతడు మానసిక రుగ్మత తో బాధపడుతున్నాడని తెలిసింది.

వైద్యానికి ఎంతకీ సహకరించక పోగా చివరికి ఆండ్రూ ఆత్మహత్యకి పాల్పడ్డటంతో కుటుంభం తీవ్ర విషాదంలో ఉండిపోయింది.