కూతురిపైనే అత్యాచారం..అమెరికా కోర్టు ఘోరమైన తీర్పు..  

American Citizen David Richards Raping Adopted His Daughter-court,david Richards,paster,అమెరికా,టెన్నీసి కోర్టు

అమెరికాలోని టెన్నీసి కోర్టు న్యాయాన్ని సైతం తొక్కి పెట్టింది అంటూ ఎన్నో విమర్శలు వస్తున్నాయి. సదరు కోర్టు ఇచ్చిన తీర్పు ఇప్పుడు వివాదాస్పదం అవుతోంది. లెనార్ సిటీలో పాస్టర్ గా పని చేస్తున్న 41 ఏళ్ల డేవిడ్ రిచర్డ్స్ ఒక కీలకమైన, గౌరవప్రదమైన వృత్తిలో ఉండి, 14 ఏళ్ల తన కూతురిపై రెండేళ్ళ పాటు అత్యాచారం చేస్తూ వచ్చాడు. ఈ విషయం ఎవరికీ తెలియకుండా ఎన్నో జాగ్రత్తలు కూడా తీసుకున్నాడు..

కూతురిపైనే అత్యాచారం..అమెరికా కోర్టు ఘోరమైన తీర్పు..-American Citizen David Richards Raping Adopted His Daughter

చివరికి అతడు ఘాతుకాన్ని భరించలేక బయటకి వచ్చి మీడియాని ఆశ్రయించిన ఆమె.

పాస్టర్ ముసుగులో అతడు చేసే దారుణాలని వెల్లడించింది. తనకి జరిగిన అన్యాయాన్ని బయటపెట్టినా సరే చాలా మంది ఆమె మాటలని నమ్మలేదు సరికదా పాస్టర్ కే మద్దతు తెలిపారు.

డేవిడ్ అలాంటి వ్యక్తి కాదని ఇదంతా కావాలని జరుగుతున్న కుట్ర అంటూ మద్దతు తెలిపారు. బాలిక ఆరోపణలతో అదుపులోకి తీసుకున్న సదరు పాస్టర్ ని విడుదల చేయాలని ఆర్జీలు కూడా పెట్టారు. కానీ.

స్థానిక కోర్టు అతడు దోషేనని తేల్చింది. 14 ఏళ్ల బాలికపై, అందునా సొంత కూతురిపై అత్యాచారం చేసిన వ్యక్తిని కటినంగా శిక్షించాలని ప్రాసిక్యూటర్ వాదించారు. కానీ డేవిడ్ ఓ పాస్టర్ అనే కోణంలో అతడికి కేవలం 12 ఏళ్ల సాధారణ జైలు శిక్ష వేసి వివాదాస్పద తీర్పు చెప్పారు దాంతో స్థానిక కోరు తీర్పుపై సర్వత్రా నిరసనలు వినిపిస్తున్నాయి. న్యాయం సరిగా జరగలేదు కావున పై కోర్తులని ఆశ్రయిస్తామని బాలిక తరుపు లాయర్ తెలిపారు.