అమెరికాలో.. క్యాబ్ డ్రైవర్లు ఆ ప్రాంతానికి వెళ్ళడానికి భయపడుతున్నారు

చైనాలో విజృంభిస్తున్న కరోన వైరస్ వలన ప్రపంచ దేశాలు బయాందోళనలకు గురి అవుతోంటే, చైనీయులకు మాత్రం ఇది శాపంలా మారింది.కొన్ని దేశాలలో వారిపై దాడులు కూడా జరుగుతున్న విషయం తెలిసిందే.

 American Cab Drivers Fear To Go That Place-TeluguStop.com

అయితే ఇటీవల అమెరికాలో, చైనా ట్రైన్ మెట్రో స్టేషన్ లో ఓ చైనా మహిళపై గుర్తు తెలియని వ్యక్తులు దాడులు జరిపారు.ఈ సంఘటన మరువక ముందే, చైనా దేశస్థులను లాస్ ఏంజెల్స్ లో అమెరికన్లు దూషిస్తున్నారని వార్తలు వినిపించాయి.

ఈ పరిణామాలన్ని చోటు చేసుకోవడానికి కారణం, చైనీయుల వలన తమ దేశస్థులకు ఎక్కడ కారోనా వైరస్ సోకుతుందన్న భయంతోనే అమెరికన్లు ఇలా ప్రవర్తిస్తున్నారట… ఇదిలా ఉంటే…

న్యూయర్క్ లోని ఫ్లషింగ్ ప్రాంతంలో చైనీయులు 70 వేలకు పైగా నివసిస్తున్నారు.ఈ ప్రాంతానికి వెళ్ళడానికి క్యాబ్ డ్రైవర్లు కూడా భయపడుతున్నారు.

ఆ ప్రాంతానికి వెళ్లి, వారిని ఎక్కించుకునే క్రమంలో వారికి కూడా కరోనా మహమ్మారి ఎక్కడ సోకుతుందోనని, ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడల్లా యాప్ ని ఆఫ్ లైన్ లో పెట్టి తిరిగి, వేరే ప్రాంతానికి చేరుకోగానే ఆన్లైన్ లోకి పెడుతున్నారు.‘చైనీయులతో ఈ విధంగా ఉండటం బాధకరమే కానీ, వారి వలన నాకు కరోనా వస్తే నా కుటుంబాన్ని ఎవరు ఆదుకుంటారు’ అని ఓ క్యాబ్ డ్రైవర్ తన ఆవేదనని వ్యక్తం చేశాడు.

ఈ ప్రాంతంలోని చైనీయులనే కాదు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి వచ్చె చైనీయులను కూడా ఎక్కించుకోవడానికి క్యాబ్ డ్రైవర్లు సాహసం చేయడం లేదు.ఈ నేపధ్యంలోనే.

అమెరికాలోని క్యాబ్ డ్రైవర్ల వలన ఏ ఒక్క చైనీయులైనా వివక్షకు గురైతే, ఆ క్యాబ్ డ్రైవర్లపై తగిన చర్యలు తీసుకుంటామని ట్యాక్సీ అండ్ లిమోజిన్ కమిషన్ అధికారులు తేల్చి చెప్పేశారు.ఒకవేళ ఇలానే వివక్ష కొనసాగి, క్యాబ్ డ్రైవర్ పై వివక్షకు సంబంధించిన కేసు నమోదైన పక్షంలో, మొదటిసారి 500 డాలర్లు జరిమానా , రెండవసారి 1000 డాలర్ల జరిమానాతోపాటు నెలరోజులు లైసెన్స్ క్యాన్సిల్ చేస్తామని, మూడోసారి కూడా కేసు నమోదైతే అతని లైసెన్స్ శాశ్వతంగా క్యాన్సేల్ చేస్తామని సంబంధించిన అధికారులు హెచ్చరించారు.

కాగా, ఇప్పటి వరకు అమెరికా మొత్తం మీద 16 మంది కరోనా వైరస్ భారిన పడ్డారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube