క్షయరహిత భారతే లక్ష్యం... కేంద్రానికి ఇండో అమెరికన్ వైద్యుల సంఘం మద్ధతు

టీబీ లేదా క్షయ.ఒకప్పుడు భారత్‌తో పాటు ఎన్నో దేశాలను గడగడలాడించిన ఈ వ్యాధిని ఆధునిక వైద్య శాస్త్రం చాలా వరకు కట్టడి చేయగలిగింది.కానీ ఇటీవలి కాలంలో ఈ మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది.క్షయ వ్యాధి కారక సూక్ష్మజీవులను 1882 మార్చి 24న శాస్త్రవేత్తలు గుర్తించారు.నాటి నుంచి ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో ప్రతిఏటా మార్చి 24న ప్రపంచ క్షయ నివారణా దినోత్సవం నిర్వహిస్తున్నారు. భారత్‌లో 2025 నాటికి టీబీ లేకుండా చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే.

 American Association Of Physicians Of Indian Origin Supports Campaign To Make In-TeluguStop.com

క్షయవ్యాధి వల్ల ప్రతిఏటా 4,20,000 మంది ప్రాణాలు కోల్పోతున్నారని అంచనా.ఇతర అంటువ్యాధుల కంటే ఎక్కువగా ఇది మనుషుల ప్రాణాలను తీస్తోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రతి ఏటా 2.8 మిలియన్ల మంది వ్యక్తులు టీబీకి గురవుతున్నారని.దీని వల్ల లక్షలాది కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గణాంకాలు తెలుపుతున్నాయి.

టీబీని అంతం చేయాలన్న భారతదేశ ప్రయత్నాలపై కరోనా మహమ్మారి తీవ్ర ప్రభావం చూపింది.

అయితే అమెరికాలో స్థిరపడిన భారత సంతతి వైద్యులు.క్షయరహిత భారత్ లక్ష్యానికి మద్ధతు ప్రకటించారు.టీబీ నియంత్రణ కార్యక్రమానికి మద్ధతు ఇవ్వడం ద్వారా.భారీ సవాల్‌ను ఎదుర్కొనేందుకు ముందుకు వచ్చారు.అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అధ్యక్షుడు డాక్టర్ రవి కొల్లి మాట్లాడుతూ.భారత్‌లోని అనేక సమస్యలకు తక్షణ పరిష్కారం లేదన్నారు.

కానీ జాతీయంగా, రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వాలతో సహకరించడం ద్వారా .ఎన్జీవోలతో కలిసి పనిచేయడం ద్వారా భారత సంతతి వైద్యులు భారీ మార్పును సాధించగలరని డాక్టర్ రవి ఆశాభావం వ్యక్తం చేశారు.

Telugu Aapi, America, American, Corona, Dr Ravi Kolli, India, India Tb, Physicia

ఏఏపీఐ, యూఎస్ఏఐడీ ఇతర ఎన్జీవోలతో కలిసి భారత్‌లోని ఆరోగ్య కార్యక్రమాలకు మద్ధతుగా అమెరికాలో నివసిస్తున్న 1,00,000 మంది భారతీయ వైద్యుల నెట్‌వర్క్‌ను ఉపయోగించుకోనున్నాయి.టీబీపై అవగాహన, గుర్తింపు, చికిత్స కోసం ఏఏపీఐ ప్రైవేట్ ఛారిటబుల్ క్లినిక్‌ల నెట్‌వర్క్‌ను కూడా నిమగ్నం చేయనున్నారు.అత్యాధునిక ఆరోగ్య సంరక్షణ పరిష్కారాలను మార్పిడి చేసుకోవడానికి భారత్ – అమెరికాలలోని మెడికల్ స్కూల్స్ మధ్య సహకారానికి వున్న అవకాశాలను అన్వేషిస్తారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube