పక్షిని పట్టుకోబోయి జైలు పాలయిన అమెరికా వాసి..!!!  

American Arrested For Catching Pelican Bird Goes Viral And Arrested-nri,pelican Bird,pelican Bird Goes Viral And Arrested,telugu Nri News Updates

అమెరికాలోని ఫ్లోరిడా కి చెందిన ఓ వ్యక్తి కొంగ జాతికి చెందిన ఫెలికన్ పక్షిని పట్టుకోవడానికి విశ్వప్రయత్నం చేశాడు, ఆ కొంగ గొంతు పిసికి మరీ దానిని హింసించాడు. దాంతో పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. అయితే అతడు చేసిన ఈ దుశ్చర్య ఎలా పోలీసులకి తెలిసిందంటే..

పక్షిని పట్టుకోబోయి జైలు పాలయిన అమెరికా వాసి..!!!-American Arrested For Catching Pelican Bird Goes Viral And Arrested

అతడు ఆ పక్షిని బలవంతంగా గొంతు పట్టుకుని తన పడవలకి లాక్కుని వెళ్లాలని చేస్తున్న ప్రయత్నం, అతడి నుంచీ ఆ పక్షి తప్పించుకోవాలని పడిన తపన, అతడి ముఖంపై తన పొడవాటి ముక్కుతో పొడుస్తున్న వీడియోలు చివరికి అతడినుంచీ తప్పించుకుని ఆకాశంలోకి ఎగిరిపోయిన వీడియో అక్కడే ఉన్న సిసి కెమెరాలో రికార్డ్ అయ్యింది.

దాంతో ఈ వీడియోని అతడే స్వయంగా ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. ఆ వీడియో కాస్తా వైరల్ అవ్వడంతో ఫ్లోరిడా లోని పోలీసుల చెంతకి చేరింది. దాంతో వెంటనే ఈ చర్యకి పాల్పడిన ఆ వ్యక్తిని పట్టుకుని అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. మరి అమెరికా చట్టాల ప్రకారం అతడికి ఎటువంటి శిక్ష పడుతుందో తెలియాల్సి ఉంది.