అమెరికాలో కరోనా వ్యాక్సినేషన్..ఆందోళనలో అమెరికన్స్..!!

కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలకంటే కూడా అమెరికాపై చూపించిన ప్రభావం అంతాయింతా కాదు.3 లక్షల మరణాలు, కోట్లాది కరోనా బాధితులతో యావత్ అమెరికా భయంతో వణికిపోయింది.ఆర్ధిక స్థితి కుప్ప కూలడంతో కేవలం కరోనా కు మందు కన్పెట్టడం ద్వారామాత్రమే ఈ మహమ్మారిని అదుపు చేయగలమని భావించిన అమెరికా ఎట్టకేలకు కరోనా వ్యాక్సిన్ ను తక్కువ సమయంలోనే అమెరికా ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది.ఫైజర్ కంపెనీ తయారు చేసిన ఈ వ్యాక్సిన్ ఇప్పటికే అమెరికా వ్యాప్తంగా పలు రాష్ట్రాలకు సరఫరా చేయబడింది.

 American Anxiety For Fizer Corona Vaccine, Corona Epidemic,   Financial Status,-TeluguStop.com

ఫైజర్ కంపెనీ మొట్టమొదటి వ్యాక్సిన్ ను న్యూయార్క్ లోని లాంగ్ ఐల్యాండ్ మెడికల్ సెంటర్ లోని క్రిటికల్ కేర్ సెంటర్ లోని ఓ సీనియర్ నర్సు సాండ్రా కు వేశారు.అమెరికా మీడియా మొత్తం ఈ కార్యక్రమాన్ని లైవ్ టెలికాస్ట్ చేసింది.

ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ అమెరికా మొట్టమొదటి వ్యాక్సిన్ విజయవంతంగా నమోదు అయ్యింది.అమెరికన్స్ ఇకపై ప్రశాంతంగా ఉండచ్చని ట్వీట్ చేశారు.

వ్యాక్సిన్ ను వేయించుకున్న సాండ్రా మొదటి వ్యాక్సిన్ వేసుకున్నందుకు ఎంతో అనుభూతిని పొందానని, చరిత్రలో ఇది మర్చిపోలేని రోజని ఆమె తెలిపారు.ఇదిలాఉంటే

Telugu American Nurse, Corona Epidemic, Longisland, Pfizer, Effect, Vaccine, Opp

అమెరికాలో ఫైజర్ కంపెనీ విడుదల చేసిన ఈ వ్యాక్సిన్ పై మెజారిటీ అమెరికన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారని అమెరికన్ నర్సేన్ ఫౌండేషన్ తెలిపింది.తాము చేపట్టిన సర్వేల ఆధారంగా ఈ విషయం వెల్లడయ్యిందని ప్రకటించింది.అసలు ఈ వ్యాక్సిన్ ప్రయోగాత్మకంగా సక్సెస్ అయ్యిందా, ఈ వ్యాక్సిన్ పై ప్రయోగించిన వారి పరిస్థితి ఎలా ఉంది, సైడ్ ఎఫెక్ట్ ల ప్రభావం ఎలా ఉంది, వృద్దులపై ఈ వ్యాక్సిన్ ఏ స్థాయిలో ప్రభావం చూపుతోంది, అనే సందేహాలు ఎక్కువగా వ్యక్తం చేశారని, వ్యాక్సిన్ తీసుకునే వారికంటే వ్యాక్సిన్ ను వ్యతిరేకించే వారే ఎక్కువగా ఉన్నారని వెల్లడించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube