అమెరికా ఎయిర్ లైన్స్ సంచలన నిర్ణయం..!!!  

American Airlines, American Airlines to remove Employees, Corona Effect - Telugu

కరోనా ప్రపంచ వ్యాప్తంగా సృష్టించిన ప్రాణ, ఆస్తి నష్టాలు లెక్కలు వేసుకుంటే ఒళ్ళు గగ్గుర్లు పుడుతుంది.కరోన ప్రభావం తీవ్రంగా ఉన్న దేశంలోని వారికి ఈ విషయం ఇప్పటికే స్పష్టంగా అర్థమయ్యే ఉంటుంది.

 American Airlines Remove Employees

ఉద్యోగాలు పోగొట్టుకుని, చేతిలో చిల్లి గవ్వలేక ప్రభుత్వం అందించే సాయం కోసం ఆశగా ఎదురు చేస్తున్నారు ఎంతో మంది.ముఖ్యంగా ఈ పరిస్థితి అమెరికాలో అత్యధికంగా కనిపిస్తోంది.

ఎంతో మంది అమెరికా ప్రజలు ప్రస్తుతం దుర్భరమైన జీవితం గడుపుతున్నారు.

అమెరికా ఎయిర్ లైన్స్ సంచలన నిర్ణయం..-Telugu NRI-Telugu Tollywood Photo Image

ప్రస్తుతం అమెరికాలో ప్రముఖ వ్యాపారాలు మూతబడే పరిస్థితి చేరుకున్నాయి దాంతో ఉద్యోగాలు కోల్పోయిన ఎంతో మంది నిరుద్యోగులుగా మారుతున్నారు.

ఈ క్రమంలోనే అంతర్జాతీయ పర్యాటక రంగంపై కూడా తీవ్రమైన ప్రభావం పడింది.దాంతో ఈ ప్రభావం ఎయిర్ లైన్స్, విమానయాన తయారీ సంస్థలపై మరింత ప్రభావం పడింది.

ఇప్పటికే ఎన్నో సంస్థలు తమ ఉద్యోగులని తొలగిస్తున్న క్రమంలోనే అమెరికా ఎయిర్ లైన్స్ కూడా ఉద్యోగులని సంఖ్యని భారీగా తగ్గించింది.

అమెరికా ఎయిర్ లైన్స్ తమ సంస్థ నుంచీ దాదాపు 36 వేల మందిని ఉద్యోగాల నుంచీ తొలగించే ప్రయత్నానికి రంగం సిద్దం చేస్తోంది.

ఉద్యోగులని సెలవులపై పంపే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లుగా సమాచారం అందుతోంది.ఈ విషయంపై ఇప్పటికే సిబ్బందికి సూచన ప్రాయంగా సూచనలు అందించినట్టుగా తెలుస్తోంది.

ఒక వేళ అదే నిజమైతే 15 వేలమంది ఫ్లైట్ సిబ్బంది, మిగిలిన 15 వేల మందిలో కస్టమర్ ఎగ్జిక్యూటివ్ లను పూర్తి స్థాయి సెలవులతో ఇంటికి వెళ్లనున్నారని అంటున్నాయి కంపెనీ వర్గాలు.

#Corona Effect

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

American Airlines Remove Employees Related Telugu News,Photos/Pics,Images..