ఆంక్షల ఎత్తివేతతో మళ్లీ పెరుగుతున్న రద్దీ : భారతీయులకు ‘‘ అమెరికన్ ఎయిర్‌లైన్స్’’ శుభవార్త ..!!!

భారత్‌తో పాటు వివిధ దేశాల్లో కరోనా పరిస్థితులు మెరుగుపడినందున కొవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఆయా దేశాల పౌరులను దేశంలోకి అనుమతించాలని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ నిర్ణయించారు.దీనిలో భాగంగా వాక్సినేషన్‌ పూర్తిచేసుకున్న వారిని నవంబర్ 8 నుంచి అమెరికాలోకి అనుమతిస్తామని వైట్‌హౌస్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.

 American Airlines Relaunches Non-stop Flight Travels To India , American, India-TeluguStop.com

ఎఫ్‌డీఏ లేదా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఆమోదం పొందిన టీకాలను వేసుకున్న వారిని అనుమతిస్తున్నట్లు అమెరికా ప్రభుత్వం పేర్కొంది.

దీంతో దాదాపు 20 నెలల తర్వాత అంతర్జాతీయ ప్రయాణీకులకు దేశంలోకి వచ్చేందుకు అమెరికా ప్రభుత్వం అనుమతివ్వడంతో భారత ప్రయాణీకులతో నిండిన తొలి ఎయిరిండియా విమానం నవంబర్ 9న న్యూజెర్సీలోని నెవార్క్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో దిగింది.

ఈ నేపథ్యంలో తమ వారి రాకకోసం కళ్లు, కాయలు కాచేలాగా ఎదురుచూస్తున్న వారితో విమానాశ్రయంలో ఉద్వేగ వాతావరణం నెలకొంది.రెండేళ్లుగా తమ పిల్లలను చూడని తల్లిదండ్రులు, తమ మనవళ్లు, మనవరాళ్లను చేతుల్లోకి తీసుకుంటున్న తాతలు, భార్యల కోసం ఎదురుచూస్తున్న భర్తలు ఇలా ఎటు చూసినా కళ్ల నిండా నీటితో తమ వారిని ఆలింగనం చేసుకుంటున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ నేపథ్యంలో భారత్- అమెరికాల మధ్య రాకపోకలకు విపరీతమైన రద్దీ నెలకొంది.నెలలుగా తమ ప్రయాణాలను వాయిదా వేసుకున్న వారు కూడా టికెట్లు బుక్ చేసుకుంటుండటంతో ఏవియేషన్ ఇండస్ట్రీలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో అమెరికన్ ఎయిర్‌లైన్స్ సంస్థ భారతీయులకు శుభవార్త చెప్పింది.ఈ వారంలో భారతదేశానికి తిరిగి సర్వీసులను పునరుద్దరిస్తున్నట్లు తెలిపింది.

అలాగే నాన్‌స్టాప్ ట్రావెల్ కోసం పెరుగుతున్న డిమాండ్‌ను ఉపయోగించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఒకరు తెలిపారు.

Telugu American, Americanrees, Travels, India, Delhi York, Aircraft-Telugu NRI

2012లో భారతదేశానికి సేవలను నిలిపివేసిన అమెరికన్ ఎయిర్‌లైన్స్ సంస్థ .దశాబ్ధం తర్వాత న్యూఢిల్లీ- న్యూయార్క్ మధ్య విమాన సర్వీసులను పునరుద్ధరించింది.ఈ ఏడాది మార్చిలో సిలికాన్ వాలీ ఆఫ్ ఇండియా బెంగళూరు నుంచి సీటెల్ మధ్య విమానాలను ప్రారంభించింది.

ఈ రెండు మార్గాల్లో ప్రయాణ రద్దీని బట్టి.భారతదేశ ఆర్ధిక రాజధాని ముంబైకి కూడా సర్వీసులను నడుపుతామని అమెరికన్ ఎయిర్‌లైన్స్ ఎండీ లాటిగ్ చెప్పారు.

బోయింగ్ నుంచి వైడ్ బాడీ ఎయిర్‌క్రాఫ్ట్ డెలివరీ కోసం వేచిచూస్తున్నందున విస్తరణ అనేది విమానాల లభ్యతపై కూడా ఆధారపడి వుంటుందని ఆయన తెలిపారు.అటు యూరప్ దేశాల నుంచి ముఖ్యంగా బ్రిటన్ నుంచి కూడా డిమాండ్ బలంగా వుంది.

నవంబర్ 8 నుంచి అంతర్జాతీయ ప్రయాణీకులకు అమెరికా తలుపులు తెరిచిన తర్వాత మెక్సికో, లాటిన్ అమెరికా దేశాల్లోని కొన్ని ప్రాంతాల నుంచి డిమాండ్ 2019 స్థాయిలను అధిగమించిందని లాటిగ్ తెలిపారు.కానీ ఆసియాలో మాత్రం డిమాండ్ ఇంకా పుంజుకోలేదు.

ఈ రీజియన్‌లో కోవిడ్ మహమ్మారికి ముందు కంటే 25 శాతం తక్కువ సామర్ధ్యంతో తమ విమానాలు నడుస్తున్నట్లు ఆయన చెప్పారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube