ప్రభాస్, ఎన్టీఆర్ కంటే ముందు పవర్ స్టార్స్ ఉన్నారా.. అమెరికా నటి ట్వీట్ వైరల్?

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో పాన్ ఇండియా సినిమాలో ట్రెండు నడుస్తోంది.దీనితో స్టార్ హీరో నుంచి అగ్ర హీరోల వరకు ప్రతి ఒక్కరు పాన్ ఇండియా సినిమాల విషయంలో ఆసక్తిని కనబరుస్తున్నారు.

 American Actress Rebecca Grant Tweets About Tollywood Powerstar American Actress-TeluguStop.com

కాగా ఇప్పటికీ టాలీవుడ్ లో పలువురు హీరోలు పాన్ ఇండియా స్టార్ లుగా మారిన విషయం తెలిసిందే.బాహుబలి సినిమాతో ప్రభాస్ ఫాన్ ఇండియా స్టార్ గా మారగా పుష్ప సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా మారాడు.

అలాగే ఆర్ఆర్ఆర్ సినిమాతో రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ లు పాన్ ఇండియా హీరోలుగా పరిచయమైన విషయం తెలిసిందే.దేశవ్యాప్తంగా ఆ ప్రపంచ వ్యాప్తంగా కూడా హీరోలుగా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు.

దీంతో టాలీవుడ్ హీరోల గురించి దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు కూడా మాట్లాడుకుంటున్నారు.ఇది ఇలా ఉంటే ఇటీవలే అమెరికన్ నటి ఆర్ఆర్ఆర్ సినిమాను చూసి టాలీవుడ్ లో ప్రభాస్, రాంచరణ్ కంటే ముందు పవర్ స్టార్ ఎవరైనా ఉన్నారా అంటూ సోషల్ మీడియాలో ఒక ట్విట్ చేసింది.

కాగా జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ అభిమాని చూసి ఇప్పటికే పలువురు విదేశీయులు కూడా కురిపించిన విషయం తెలిసింది.ఈ క్రమంలోనే తాజాగా హాలీవుడ్ నటి, టీవీ వ్యాఖ్యాత రెబెకా గ్రాంట్, ఆర్ఆర్ఆర్ సినిమా తాను కూడా చూసినట్లు తెలిపింది.

ఆ తర్వాత ప్రభాస్, రామ్ చరణ్ లకంటే ముందు తెలుగులో పవర్ స్టార్ ఎవరో చెప్పండంటూ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టింది.దీంతో రెబెకా ట్వీట్ పై చాలామంది నెటిజన్స్ స్పందించడం విశేషం.ఈ నేపథ్యంలోనే నెటిజన్స్ ఆమె ట్వీట్ పై స్పందిస్తూ తెలుగులో మెగాస్టార్ చిరంజీవి ఒకరి స్వయంకృషితో ఎదిగాడు అని కామెంట్స్ చేయగా వెంటనే స్పందించిన రెబెకా.అవునా.

ప్రభాస్ రామ్ చరణ్ కంటే ముందు చిరంజీవిని పవర్ స్టార్ అయితే నేను ఆయన సినిమాలు చూడాలి అంటే ఆయన సినిమాలు ఇంగ్లీష్ లో సబ్ టైటిల్స్ ఉన్న సినిమాలు ఏవైనా ఉంటే నాకు తెలపండి అంటూ రిప్లై ఇచ్చింది రెబెకా.ఈ నేపథ్యంలోనే పలువురు ఆమె పై నెగటివ్ గా కూడా కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube