అమెరికా మహిళ ఓవర్ కాన్ఫిడెంట్..రిజల్ట్ ఏ రేంజ్ లో వచ్చిందో తెలుసా..!!

ప్రతీ ఒక్క మనిషికి కాన్ఫిడెంట్ లెవిల్స్ ఉండాలి అప్పుడే జీవితంలో విజయం సాధిస్తారు.కానీ కాన్ఫిడెంట్ కాస్తా ఓవర్ కాన్ఫిడెంట్ గా మారితేనే అసలు సమస్యలు వచ్చిపడుతాడు.

 America Woman Got Corona, Over Confidence, Corona Positive,telugu Nri-TeluguStop.com

ఇలాంటి సంఘటనే అమెరికాలో ఓ మహిళకి ఎదురయ్యింది.అసలే కరోనా సమస్యతో కొట్టి మిట్టాడుతున్న దేశం.

లక్షలాది మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు.లాక్ డౌన్ తో అమెరికా వ్యాప్తంగా ఎవరూ బయటికి కూడా రావడంలేదు.

కానీ ఫ్లోరిడాలో కాస్త లాక్ డౌన్ సడలించడంతో ఎంతో మంది వీధుల్లోకి వచ్చినా జాగ్రత్తలు తీసుకుంటూ రోడ్డుపై చెత్తా చెదారం తినకుండా జాగ్రత్తలు పడుతున్నారు.

అదే ఫ్లోరిడా కి చెందిన 40 ఏళ్ళ మహిళ.

ఎన్నో నెలలుగా చిరు తిండ్లు తినక నోటికి తాళం పడిందని తెగ ఫీల్ అయ్యిపోయింది.లాక్ డౌన్ సడలించడంతో నాకేం కాదు నేను అన్ని జాగ్రత్తలు తీసుకున్నాను అంటూ తన స్నేహితులతో కలిసి వీధుల్లో గిర్రు గిర్రున తిరుగుతూ హోటల్ కెళ్ళి ఫుల్లుగా కడుపు నింపుకుంది.

తనతో పాటు తన స్నేహితులకి కూడా అన్నీ ఆర్డర్ ప్రకారం తినమని చెప్పింది.ఇలా తిని వీధుల్లో తిరిగి తిరిగి ఇంటికి వెళ్లి పడుకుని లేచిన తెల్లారే గొంతు నొప్పి మొదలయ్యి జ్వరం వచ్చింది.

దాంతో కంగారుగానే పరీక్షలు చేయించుకున్న ఆమెకి కరోనా పాజిటివ్ అని తేలిపోయింది.ప్రభుత్వాలు బయటకి వెళ్ళే తప్పుడు ముఖానికి మాస్క్ లు వేసుకుని వెళ్ళమని చెప్పినా వినకుండా జనాలు ఎక్కువగా ఉండే హోటల్ కి వెళ్లి మాస్కులు పెట్టుకోకుండా ఉన్న వాళ్ళందరికీ కరోనా పాజిటివ్ అనే తేలిందట.

అంతేకాదు ఇప్పుడు వారితో పాటు వాళ్ళ ఇంట్లో వాళ్లందరిని హోమ్ క్వారంటైన్ కి తీసుకువెళ్ళారట.మేము వద్దని చెప్పినా బలవంతంగా ఏమి కాదని తీసుకు వెళ్లిందని కరోనా సోకుతుందని అనుకోలేదని బోరు మంటున్నారు ఆమె స్నేహితులు.

మరి ఆమెకి నోటి మాట కూడా రావడం లేదట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube