ఇండియాలో పరిస్థితిపై వైట్ హౌస్ కీలక కామెంట్స్..!!

చైనా నుండి ఎప్పుడైతే కరోనా వైరస్ ప్రపంచ దేశాల్లో కి ఎంటర్ అయిందో మొదటిలో అద్భుతంగా ఇండియా తనని తాను కాపాడుకుంది.అంతేకాకుండా ప్రపంచంలో ఆ సమయంలో కరోనాతో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న దేశాలకు సాయం కూడా చేయడం జరిగింది.

 America White House Key Comments On The Situation In India, America, White House-TeluguStop.com

ఆ సమయంలో ఇండియా చేసిన సేవలకు మరియు కరోనా ని ఎదుర్కొన్న తీరుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ప్రశంసల వర్షం కురిపించింది.కానీ ఎప్పుడైతే కరోనా సెకండ్ వేవ్ విషయముల తప్పటడుగు వేసింది ప్రస్తుతం ఇండియాలో పరిస్థితులు చూసి ప్రపంచ దేశాలు సానుభూతి వ్యక్తం చేస్తున్నాయి.

అంతేకాక ఇండియా నుండి ఎవరు కూడా తమ దేశంలోకి అడుగు పెట్టకూడదు అనే స్థాయికి దిగజారిపోయే రీతిలో పరిస్థితులు ఇండియాలో నెలకొన్నాయి.ఇటువంటి తరుణంలో అనేక దేశాలు ఇండియాలో కరోనా పరిస్థితిని అధిగమించడానికి సాయం అందించడానికి ముందుకు వస్తున్నాయి.

ఆ రీతిగానే అమెరికా దేశంలో దిగ్గజ సంస్థలు పెద్ద ఎత్తున ఇండియాకి వైద్య పరికరాలు మరియు ఆక్సిజన్ కొరత తీర్చడానికి సాయం అందిస్తున్నయి.భయంకరంగా కేసులు పెరిగిపోవటం, మరణాలు సంభవిస్తున్న ఇలాంటి తరుణంలో అమెరికా వైట్ హౌస్.

కష్ట సమయంలో భారత్ కి అన్ని విధాలా అండగా ఉంటామని కీలక ప్రకటన చేసింది.ఖచ్చితంగా ఇండియాలో ఉన్న ప్రభుత్వంతో అమెరికా ప్రభుత్వం పని చేస్తుందని తెలియజేయడమే కాక.అమెరికా అధ్యక్షుడు బైడెన్ ప్రభుత్వం నుంచి 100 మిలియన్ డాలర్ల సాయం అందించింద‌ని పేర్కొంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube