భారతీయ విద్యార్ధులకి అమెరికా హెచ్చరిక..!!!  

America Warns To Students From Other Countries-

అమెరికాలో ఉన్నత విద్యని అభ్యసించాలని అనుకునే భారతీయ విద్యార్ధులకి అమెరికా కొన్ని సూచనలు చేసింది. ఇక్కడ చదువుకోవాలని అనుకునే వారు తప్పకుండా అత్యంత జాగ్రత్తగా వ్యవహరిచాలని తెలిపింది. విద్యార్ధులు ఏ యూనివర్సిటీలలో అయితే చేరాలని వస్తున్నారో ఆయా యూనివర్సిటీ లలో అడ్మిషన్లు తీసుకునే ముందే తెలివిగా వ్యవహరించాలని సూచించింది..

భారతీయ విద్యార్ధులకి అమెరికా హెచ్చరిక..!!!-America Warns To Students From Other Countries

ఈ మేరకు అమెరికా అధికారులు మూడు అంశాలని పరిగణలోకి తీసుకోవాలని సూచించారు.

గడిచిన కాలం జనవరిలో పే టూ స్టే వీసా స్కాం లో నకిలీ యూనివర్సిటీలలో పేర్లు నమోదు చేసుకున్న 129 మంది భారతీయ విద్యార్థులను అమెరికా అధికారులు అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలోనే ఈ సూచనలు చేశారు అధికారులు. అసలు సదరు యూనివర్సిటీ ఒక క్యాంపస్‌ నుంచే నడుస్తున్నదా? పరిపాలనా విభాగంలోనే వెబ్‌సైట్‌ను నిర్వహిస్తున్నారా? అంటూ పలు విషయాలని పరిగణలోకి తీసుకోవాలని తెలిపారు.

ఇవన్నీ లేని పక్షంలో వెంటనే ఆ యూనివర్సిటీ లలో చదవాలనే విషయాన్ని పక్కకి పెట్టేయండి అని తెలిపారు. ఒక వేళ అలా లేని పక్షంలో నకిలీ యూనివర్సిటీల్లో చేరిన విద్యార్థులు రెగ్యులర్‌ వీసా పొందినా సరే వీసా ఉల్లంఘనగా పరిగణించి వారిని వెనక్కి పంపెస్తామని హెచ్చరించారు అధికారులు.