అమెరికాలో దారుణం : మళ్ళీ పేలిన తూటా…!!!  

America Violence 7members Death - Telugu America, American Police, Culture, Gun Violence, Us

పేరుకి అగ్ర రాజ్యమే కానీ అక్కడ జరిగే ఆగడాలకి అంతూ పంతూ ఉండదు.అభివృద్ధి చెందిన దేశంగా పిలవబడినా మొన్న కరోనా ధాటికి కనీసం మాస్క్ లు, విద్యలకి సంభందిన పరికరాలు అందచేయడంలో పూర్తిగా వెనుకబడింది.

 America Violence 7members Death

ఇదిలాఉంటే అమెరికా పేరు చెప్తే ముందుగా గుర్తొచ్చేది లిబర్టీ విగ్రహం అయితే ఆ తరువాత గుర్తొచ్చేది మాత్రం గన్ కల్చర్. పెద్దన్న గా అన్ని దేశాలకి సుద్దులు చెప్పే అమెరికా ఎంతో మంది అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోయెలా చేస్తున్న గన్ కల్చర్ ని మాత్రం నియంత్రించలేక పోతోంది.

అమెరికా వ్యాప్తంగా ఎదో ఒక ప్రాంతంలో ఎక్కడో ఒక చోట ప్రతీ రోజు తుపాకీ చప్పుళ్ళు వినపడం పరిపాటి అయ్యిపోయింది.తాజాగా అమెరికాలోని అలబామా రాష్ట్రంలో గన్ కల్చర్ కారణంగా సుమారు 7 గురు చనిపోయారుఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

అమెరికాలో దారుణం : మళ్ళీ పేలిన తూటా…-Telugu NRI-Telugu Tollywood Photo Image

నిన్నటి రోజు రాత్రి 11 గంటల సమయంలో మౌంటీ కౌంటీ ప్రాంతంలో ఓ ఇంట్లో కాల్పులు జరిగిన శబ్దం రావడంతో ఒక్క సారిగా చుట్టుపక్కల ఉన్నవారు భయభ్రంతులకి లోనయ్యారు.

పోలీసులకి సమాచారం అందగానే హుటాహుటిన వచ్చి సంఘటన స్థలాని పరిశీలించారు.

కాల్పులు జరిగిన ఇంట్లో ఏడుగురు మృతి చెందినట్టుగా గురించిన పోలీసులు అక్కడ మంటలు చెలరేగడంతో మంటలని ఆర్పారు.ఈ దారుణ ఘటనపై స్పందించిన పోలీసులు మృతులు ఒకే కుటుంభానికి చెందినవారా లేదా ఈ వేర్వేరు ప్రాంతాల వారా.

ఈ ఘటన ఎలా జరిగింది అన్న కోణంలో దర్యాప్తు చేపడుతున్నారు.అమెరికా వ్యాప్తంగా ఇలాంటి సంఘటనలు సర్వ సాధరనమై పోతున్నా ప్రభుత్వం మాత్రం గన్ కల్చర్ ని నియంత్రించడంలో విఫలం అవుతోందని అంటున్నారు హక్కుల సంఘాల నేతలు.

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test