అమెరికాలో కీలక అధికారులకి కరోనా...!!!

అమెరికా వ్యాప్తంగా కరోనా విలయ తాండవం చేస్తోంది.ప్రపంచ వ్యాప్తంగా కరోనా బాధిత దేశాలలో అమెరికా ముందు వరుసలో నిలిచింది.

 America , Corona Effect,corona Positive, Seld Quarantine, Tump,mike Pence, Us Vi-TeluguStop.com

అగ్ర రాజ్య హోదాకి తగ్గట్టుగా అన్ని విషయాలలో ముందు ఉండే అమెరికా కరోనాలో సైతం ముందే నిలిచింది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.ఇదిలాఉంటే కరోనా తగ్గుముఖం పడుతోందని ఒక పక్క ట్రంప్ ప్రకటనల మీద ప్రకటనలు చేస్తుంటే మరో పక్క కరోనా ఎక్కడా వెనక్కి తగ్గే పరిస్థితులు కనపడటంలేదు.

తాజాగా అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ సెల్ఫ్ క్వారంటైన్ కి వెళ్ళడంతో సర్వాత్ర ఆందోళన నెలకొంది.మైక్ మీడియా సెక్రెటరీ కి తాజాగా కరోన సోకడంతో మైక్ సైతం నిర్భంధంలోకి వెళ్ళక తప్పలేదు.

దాంతో అమెరికా ఉపాధ్యక్షుడికే కరోనా సోకిందా అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.ఇదిలాఉంటే కేవలం మైక్ కి మాత్రమే ఈ పరిస్థితి ఎదురవ్వలేదు.కరోనా నియంత్రణ కోసం అమెరికా వ్యాప్తంగా కరోనాని కంట్రోల్ చేయడానికి ట్రంప్ కొంత మందితో కలిసి గ్రూప్ ని ఏర్పాటు చేశారు.ఇందులో అమెరికాలోని అత్యంత నిపుణులు.

కీలక సభ్యులు ఉన్నారు.ప్రస్తుతం వారిలో ముగ్గురికి కరోనా పాజిటివ్ తేలడంతో మరింత ఆందోళన నెలకొంది.

Telugu America, Anthony Fauci, Corona Effect, Corona, Mike Pence, Seld Quarantin

అలర్జీ , అంటూ వ్యాధులు నివారణ జాతీయ సంస్థ డైరెక్టర్ అంటోని పౌఛీ, వ్యాధి నియంత్రణ నివారణ కేంద్రం డైరెక్టర్ రాబర్ట్ రెడ్ ఫీల్డ్ , ఆహార ఔషద పరిపాలాన విభాగం కమీషనర్ స్టీఫెన్ హాన్ లు సైతం స్వీయ నిర్భంధంలోకి వెళ్ళారు.దాంతో అమెరికా ప్రజలు మరింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.కరోనాపై పోరులో భాగంగా వీరిని ట్రంప్ నియమించారు.కానీ వారికే కరోనా సోకడంతో ప్రజలు కరోనాపై మరింత భయాన్ని పెంచుకున్నారు.ఇదిలాఉంటే వైట్ హౌస్ ఓ ముగ్గురు కీలక అధికారులకి సైతం కరోనా పాజిటివ్ వచ్చిన విషయం విధితమే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube