మాస్క్ లేకుండానే కరోనా రోగుల వద్దకు,ఉపాధ్యక్షుడి నిర్వాకం

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న విషయం తెలిసిందే.ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికా ఈ వైరస్ ఎంతటి నష్టాన్ని ఏర్పరచిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.10 లక్షల మందికి పైగా కరోనా మహమ్మారి సోకగా,60 వేల పై చిలుకే ప్రజలు మృత్యువాత పడ్డారు.అయితే ఇంతగా ప్రబలుతున్న కరోనా మహమ్మారి నేపథ్యంలో ఆ దేశ ఉపాధ్యక్షుడు చేసిన పని పెద్ద వివాదాస్పదంగా మారింది.

 Mike Pence,america,corona,face Mask,america Vice President-TeluguStop.com

ఈ మహమ్మారి కారణంగా ప్రతి ఒక్కరూ ముఖానికి మాస్క్ ధరించాలి అని నిపుణులు హెచ్చరిస్తున్న ఈ సమయంలో అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ ఎలాంటి మాస్క్ ధరించకుండా కరోనా రోగులను పరామర్శించిన వైనం వివాదాస్పదంగా మారింది.మిన్నెసోటాలోని ఓ క్లినిక్‌ని సందర్శించిన ఆయన ముఖానికి ఎలాంటి మాస్క్ లేకుండానే కరోనా రోగుల వద్దకు వెళ్లి మంచి చెడ్డా అడిగి తెలుసుకున్నారు.

అంతేకాకుండా ఆయనవెంట ఓ పదిమంది పటాలాన్ని కూడా వేసుకొని మరీ వెళ్లి వారిని పరామర్శించారు.అయితే ఆ పదిమందిలో ఓ కరోనా పేషంట్‌తో పాటు వైట్‌హౌస్‌లో కరోనా వైరస్ టాస్క్‌ఫోర్స్ సభ్యులు కూడా ఉన్నారు.

అయితే వారికి కరోనా భయం ఉంది కాబట్టి ముఖానికి మాస్కులు ధరించి వచ్చారు.
కానీ, తాను అమెరికాకే ఉపాధ్యక్షుడిని నన్ను కరోనా ఏమి చేస్తుంది అన్న ధీమా నో ఏమో గానీ ఆయన మాత్రం మాస్క్ ధరించకుండానే క్లినిక్ లో కలియదిరిగారు.

అయితే ఆ క్లినిక్ లో రోగులు, విజిటర్లు, స్టాఫ్ అందరూ విధిగా మాస్కులు ధరించాలని తన వెబ్‌సైట్‌లో పొందుపరిచింది.అయితే మైక్ పెన్స్ వ్యవహరించిన తీరుపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.

బాధ్యతగలవాళ్లే ఇలా నిర్బాధ్యతగా ప్రవర్తిస్తే కరోనా ఇంకా విజృంభించదా? అని ప్రశ్నిస్తున్నారు.అమెరికా ఉపాధ్యక్షుడి తీరుపట్ల డెమోక్రటిక్ సెనేటర్లు విరుచుకుపడుతున్నారు.

మైక్ పెన్స్ మాస్క్ ధరించకుండా ప్రమాదకరమైన ధోరణికి నాంది పలికారని ఇది చాలా పెద్ద నేరం అని మండిపడుతున్నారు.కాగా, పెన్స్ ఇలా మాస్క్ ధరించకుండా బయటకు రావడం ఇదే తొలిసారి ఏమి కాదు.
గతంలో కొలరాడో గవర్నర్‌ను గ్రీట్ చేసినప్పుడు కూడా ఆయన మాస్క్ లేకుండానే వెళ్లిన విషయం తెలిసిందే.అయితే అమెరికాలో విజృంభిస్తున్న కరోనా నేపథ్యంలో ఆ దేశ ఉపాధ్యక్షుడే నియమానాలను పాటించకపోవడం పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube