కమలా హారీస్ ప్రమాణ స్వీకారం: చీరలో వస్తారా.. ?సూట్‌లో వెళతారా..?

ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అమెరికాకు తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా.తొలి నల్లజాతి మహిళగా, తొలి ఆసియన్‌గా ఇలా అన్నింట్లో చరిత్ర లిఖించారు కమలా హారీస్.

 Sari Or Suit? The Buzz Around What Kamala Harris Will Wear On Inauguration, Kama-TeluguStop.com

కోట్లాది మంది భారతీయులు, ప్రపంచ మహిళా లోకం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రమాణ స్వీకార కార్యక్రమం రేపే జరగనుంది.ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా జరిగిపోతున్నాయి.

అయితే ప్రతిష్టాత్మక ఈ కార్యక్రమానికి కమలా హారీస్ ఎలాంటి వస్త్రధారణను ఎంచుకుంటారన్న దానిపై ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది.భారతీయ మూలాలున్న మహిళ కాబట్టి మన సాంప్రదాయం ప్రకారం చీరలో క్యాపిటల్ బిల్డింగ్‌కు వస్తారా.? లేదంటే అమెరికాలో పెరిగి, అక్కడి సమాజంలో ఒకరిగా మారిపోయారు కాబట్టి అమెరికన్ మహిళలా సూటు వేసుకుంటారా అనే దానిపై చర్చ జరుగుతోంది.మెజారిటీ అభిప్రాయం ప్రకారం… కమలా హారీస్ చీరను ధరించి అధికారాన్ని స్వీకరిస్తారనే అంచనాలు వెల్లువెత్తుతున్నాయి.

ఆసియా అమెరికా సంతతి కమ్యూనిటీ నెవాడాలో 2019లో నిర్వహించిన ఓ ఎన్నికల సమావేశంలో మీరు విజయం సాధిస్తే చీర కట్టుకుంటారా అని కమలను ఓ ప్రేక్షకుడు ప్రశ్నించినప్పుడు.ముందు గెలుద్దాం అని ఆమె సమాధానమిచ్చారు.

భారతీయ సంస్కృతి, వారసత్వం పట్ల తమకు అమిత గౌరవం ఉండేలా తల్లి తమను పెంచారు.ఇంటి పేరుతో సంబంధం లేకుండా తాము అన్ని పండుగలను జరుపుకొంటాం.

ఇది ఒక దేశంగా మన సంప్రదాయం అని కమలా హారీస్ వ్యాఖ్యానించారు.

Telugu America, Indian America, Indian Wear, Joe Biden, Kamala Harris, Sarisuit-

తమిళనాడు రాజధాని చెన్నైలో పుట్టి పెరిగిన కమలా తల్లి శ్యామలా గోపాలన్‌.తర్వాత అమెరికాకు వలస వెళ్లిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో భారతీయ సంప్రదాయానికి పెద్దపీట వేస్తూ.

చీరను ధరించడం ద్వారా కమల ప్రతిష్ట మరింత పెరగడంతో పాటు నైతిక స్ధైర్యం చేకూరుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.అయితే, కమలా హారిస్ ఎన్నో ఏళ్లుగా ఫార్మల్‌ సూట్లనే ధరిస్తూ వస్తున్నారు.

ఇప్పుడు కూడా ఆమె అదే అలవాటును కొనసాగిస్తారనే వారూ ఉన్నారు.ఇక ఆమె ఏం ధరిస్తారనేది అంత ముఖ్య విషయం కాదని కొందరంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube