ట్రంప్ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తున్న అమెరికా ప్రజలు..!!!

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆరోగ్యం క్షీణించిందా.?? ట్రంప్ రాజకీయ సభలలో గంటల కొద్దీ ప్రసంగాలు చేయలేక పోతున్నారా.?? మెట్లు ఎక్కడానికి కూడా ఆయన ఆరోగ్యం సహకరించడం లేదా అంటే అవుననే అంటున్నాయి ప్రత్యక్ష సంఘటనలు.ఓ సభలో ట్రంప్ నీటిని త్రాగడానికి కుడి చేతితో పాటుగా ఎడమ చేతిని కూడా ఉపయోగించాల్సి రాగా మరొక సభలో మెట్లు దిగడానికి చిన్న పిల్లాడిలా దిగడం ట్రంప్ ఆరోగ్యంపై పలు సందేహాలు వ్యక్తం అయ్యేలా చేస్తున్నాయి.

 Donald Tump, Health Conditinon,america Sainik Academy-TeluguStop.com

అసలేం జరిగిందంటే.

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అమెరికా సైనిక అకాడమిలో సైనికులని ఉద్దేశించి మాట్లాడుతూ మధ్యలో మంచి నీటిని తన కుడి చేతితో త్రాగే ప్రయత్నం చేశారు.

కానీ గ్లాసు నోటి వరకూ ఎత్తలేక పోవడంతో వెంటనే ఎడమ చేతితో కలిపి రెండు చేతులు ఉపయోగించి నీటిని త్రాగాల్సిన పరస్థితి కన్పించింది.దాంతో ట్రంప్ ఆరోగ్యంపై ఒక్క సారిగా సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అయ్యింది.

అంతేకాదు.

కొన్ని రోజుల క్రితం ట్రంప్ ఆర్మీ కాలేజీకి వెళ్లి అక్కడి గ్రాడ్యుయేట్స్ తో మాట్లాడిన తరువాత క్రిందకి దిగుతున్న క్రమంలో ట్రంప్ ఒంగిపోయి, అస్సలు ఓపిక లేని వాడిలా నడవడం అందరికి షాక్ కి గురి చేసింది.

వెంటనే క్రిందకి దిగిన ట్రంప్ ఎప్పటిలానే హుషారుగా కన్పించారు.దాంతో ట్రంప్ ఆరోగ్యం గాడి తప్పిందని అందరూ ఫిక్స్ అయ్యారు.ఈ పరిస్థితులని గమనించిన వైద్యులు ట్రంప్ కి బ్రెయిన్ స్కాన్ తప్పని సరిగా చేయాల్సిన అవసరం ఉందని హెచ్చరిస్తున్నారు.అసలు ట్రంప్ కి ఏమయ్యిందో తెలియాలంటే ఆయన ఆరోగ్యంపై నివేదిక వెలువడాలి కానీ ఇప్పటి వరకూ వార్షిక నివేదిక వెలువడక పోవడం మరిన్ని అనుమానాలకి తావిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube