మైక్రోసాఫ్ట్‌కు షాక్ ఇచ్చిన టిక్‌టాక్‌

క‌రోనా వైర‌స్ ప్ర‌పంచ వ్యాప్తంగా వ్యాప్తి చెందుతుంద‌డంలో ప‌లు దేశాలు డ్రాగెన్ కంట్రీపై తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్న సంగ‌తి తెలిసిందే.క‌రోనా దెబ్బ‌తో ప్ర‌పంచంలో దాదాపు అన్ని దేశాలు ఆర్థికంగా తీవ్రంగా న‌ష్ట‌పోయాయి.

 Tik Tok Gave Big Shock To Microsoft,microsoft, Big Shock, China, App, Tik Tok, O-TeluguStop.com

ఆర్థిక వ్య‌వ‌స్థ‌ల‌ను అన్నింటిని కుప్ప‌కూల్చిన క‌రోనా అగ్ర‌రాజ్యం అయిన అమెరికాను బాగా దెబ్బ‌తీసింది.క‌రోనా దెబ్బ‌తో అతలాకుత‌లం అయిన అమెరికాలో ఇప్ప‌టి వ‌ర‌కు 67 ల‌క్షల పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి.

ఇప్ప‌టి వ‌ర‌కు అమెరికాలోనే 2 ల‌క్ష‌ల మంది అధికారిక లెక్క‌ల ప్ర‌కారం చ‌నిపోయారు.అన‌ధికారికంగా చూస్తే ఈ సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుంద‌ని చెపుతున్నారు.

ఈ క్ర‌మంలోనే చైనాకు చెందిన పాపుల‌ర్ వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్‌ను ప్ర‌పంచ వ్యాప్తంగా అమెరికా, భార‌త్ స‌హా ప‌లు దేశాలు నిషేధిస్తున్నాయి.చైనాతో ఉన్న వాణిజ్య ఒప్పందాలు ర‌ద్దు చేసుకోవ‌డంతో పాటు ఆ దేశానికి చెందిన ప‌లు యాప్‌లపై చెప్పా పెట్ట‌కుండానే నిర్దాక్షిణ్యంగా బ్యాన్ విధిస్తున్నాయి.

ఒక్క భార‌త్‌లోనే చైనాకు చెందిన 200 యాప్‌ల‌పై బ్యాన్ ఉంది.దీంతో చైనా కంపెనీలు భారీగా న‌ష్ట‌పోతోన్న ప‌రిస్థితి.ఇక టిక్‌టాక్‌ను భార‌త్ ఇప్ప‌టికే నిషేధించ‌గా అమెరికాలో సైతం టిక్‌టాక్ అమెరికా బిజినెస్‌ను వేరే కంపెనీకి అమ్ముకోవాల‌ని… లేనిప‌క్షంలో అక్క‌డ బ్యాన్ త‌ప్ప‌ద‌ని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు.

Telugu American, Big Shock, China, China App, Deal, Microsoft, Tik Tok, Tiktok-G

ఇక అమెరికా టిక్‌టాక్ బిజినెస్‌ను కొనుగోలు చేసేందుకు ముందు నుంచి ప్ర‌ముఖ సాఫ్ట్‌వేర్ దిగ్గ‌జం మైక్రోసాఫ్ట్ ఆస‌క్తితో ఉంది.దాదాపు డీల్ ఓకే అయ్యింద‌న్న టాక్ కూడా వ‌చ్చేసింది.లేటెస్ట్ న్యూస్ ప్ర‌కారం తాము అమెరికా బిజినెస్‌ను మైక్రోసాఫ్ట్‌కు అమ్మ‌డం లేద‌ని టిక్‌టాక్ తేల్చిచెప్పింది.

దీనిపై మైక్రోసాఫ్ట్ కూడా స్పందిస్తూ అమెరికాలో టిక్‌టాక్ ఆప‌రేష‌న్స్‌ బైట్‌ డ్యాన్స్ అమ్మ‌డం లేద‌ని మైక్రోసాఫ్ట్ వెల్ల‌డించింది.దీంతో ఓ వైపు ట్రంప్ డెడ్‌లైన్‌తో పాటు వార్నింగ్ కూడా ఇవ్వ‌డంతో టిక్‌టాక్‌పై అమెరికాలోనూ బ్యాన్ త‌ప్ప‌ని ప‌రిస్థితి.

ఇక గ‌తంలో ట్రంప్ టిక్ టాక్ ద్వారా చైనా అమెరికా ప్ర‌జ‌ల‌పై నిఘా పెడుతోంద‌ని ఆరోపించారు.అమెరికాలో టిక్‌టాక్‌ను సొంతం చేసుకునేందుకు ఒరాకిల్‌, మైక్రోసాఫ్ట్ రెండూ పోటీప‌డ్డాయి.

ఇక భార‌త్‌లోనూ  రిల‌య‌న్స్ సంస్థ టిక్‌టాక్ ను కొనుగోలు చేస్తుంద‌ని గ‌తంలో వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube