అమెరికాలో ఘరానా దొంగ..కలర్ జిరాక్స్ చెక్కుతో ఏకంగా…  

America Thief Fraud with Color Xerox Cheque, Color Xerox Cheque, Car, Rolex Watches, America - Telugu America, America Thief Fraud With Color Xerox Cheque, Car, Color Xerox Cheque, Rolex Watches

“దొంగలందు ఘరానా దొంగలు వేరయా అమెరికాలో ఈ దొంగ రూటే సపరేటయా.” సూక్తులలో రీమిక్స్ ఏంటి అనుకుంటున్నారా కొందరు దొంగలు చేస్తున్న పనులు చూస్తుంటే ఇలా చెప్పక తప్పడం లేదు.

 America Thief Color Xerox Cheque Fraud

ఇంతకీ అసలు విషయం ఏమిటంటే.ఎక్కడైనా దొంగలు డబ్బు కాజేస్తారు, లేదంటే సంతకాలు పెట్టి ఉన్న చెక్కు బుక్కులు నోక్కేస్తారు కానీ ఇదంతా మనకెందుకు అనుకున్నాడు కాబోలు అమెరికాలోని ఓ దొంగ చాలా వింతగా ప్లాన్ చేశాడు.

ఇంకేముంది అత్యంత ఖరీదైన పోర్ష్ లగ్జరీ కారుని కొనుగులు చేశాడు.వామ్మో అనుకుంటున్నారా ఇంతకీ ఎలా కొట్టేశాడో తెలిస్తే నోళ్ళు వెళ్ళబెడుతారు.

అమెరికాలో ఘరానా దొంగ..కలర్ జిరాక్స్ చెక్కుతో ఏకంగా…-Telugu NRI-Telugu Tollywood Photo Image

అమెరికాలోని ఫ్లోరిడాకి చెందిన కెల్లీ అనే వ్యక్తి తన ఇంట్లో ఉన్న కంప్యూటర్ లో ఓ చెక్కుని కలర్ జిరాక్స్ తీయించాడు.జులై 27 న అతడు డేస్టీన్ లోని పోర్ష్ కార్ల షోరూమ్ కి వెళ్ళాడు.1,39,203 డాలర్ల విలువగల జిరాక్స్ చెక్కుని ఇచ్చి పోర్షియా కారుని కొనుగులు చేశాడు.సదరు కంపెనీ వారు కూడా చెక్కుని ధ్రువీకరించకుండానే కారుని కెల్లీ చేతిలో పెట్టేశారు.

మరుసటి రోజు చెక్కు చెల్లక పోవడంతో సదరు కంపెనీ వాల్తాన్ కౌంటీ షెరిఫ్ కార్యాలయంలో కంప్లైంట్ చేసింది.

ఇదిలాఉంటే చెల్లని జిరాక్స్ చెక్కుతో కోట్లు కొట్టేయచ్చు అనుకున్న కెల్లీ మరో ప్లాన్ వేశాడు…అలాంటి జిరాక్స్ చేక్కునే తీసుకువెళ్ళి దగ్గరలో ఉన్న నగల దుకాణానికి వెళ్ళాడు.

తనకి ఎంతో ఇష్టమైన రోలెక్స్ వాచ్ లు కొనుగులు చేశాడు.అయితే కెల్లీ పై సందేహం వచ్చిన షాపు వాళ్ళు చెక్కుని పరీక్షించిన తరువాతనే వాచ్ లు ఇస్తామని చెప్పి పోలీసులకి ఫిర్యాదు చేశారు.

దాంతో కారుతో సహా అడ్డంగా దొరికిపోయాడు కెల్లీ పోలీసుల విచారణలో తానూ తన ఇంట్లో ఉన్న కంప్యూటర్ ద్వారా ఈ చేక్కులని జిరాక్స్ తీశానని ఒప్పుకున్నాడు.

.

#Rolex Watches #America #AmericaThief

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

America Thief Color Xerox Cheque Fraud Related Telugu News,Photos/Pics,Images..