ఇదీ అమెరికాలో గన్ కల్చర్ ఎఫ్ఫెక్ట్....శాండ్విచ్ లో

అమెరికాలో గన్ కల్చర్ పై అక్కడి ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.చేతికి తుపాకి ఉంటే చిన్న చిన్న గొడవలు జరిగినా చాలు కాల్చి చంపేస్తున్నారు.

 America: There Was No Cream In The Sandwich Women Killed , America , Subway Res-TeluguStop.com

స్కూల్ లో టీచర్ కొట్టిందని, హోం వర్క్ చేయకపోతే అమ్మ కొట్టిందని, జాత్యహంకారం, ఇలా ఎన్నో రకాల కారణాలతో రోజుకు ఏదో ఓ మూలన తుపాకి చావులు వినిపిస్తూనే ఉంటాయి.తాజాగా అమెరికాలోని ఓ హోటల్ లో జరిగిన చిన్న పాటి గొడవ ఓ మహిళ మృతి కి కారణం అయ్యింది.

వివరాలలోకి వెళ్తే.

అమెరికాలోని అట్లాంటా లోని సబ్ వే రెస్టారెంట్ కు ఓ వ్యక్తి వెళ్లి శాండ్విచ్ ఆర్డర్ ఇచ్చాడు.

కాసేపటికి తాను ఆర్డర్ చేసిన శాండ్విచ్ ను మహిళా సర్వర్ తీసుకువచ్చింది.అతడు శాండ్విచ్ తింటూ ఇందులో క్రీమ్ ఎక్కువగా ఉందని ఇది వద్దంటూ గొడవ చేశాడు, పెద్ద పెద్దగా అరుస్తూ చేస్తున్న గొడవకు హోటల్ సిబ్బంది ఆందోళన చెందారు.

మహిళ సర్వర్ అతడికి ఎన్ని విధాలుగా నచ్చజేప్పుతున్నా సరే అతడు ఆవేశంతో ఊగిపోతుంటే మరొక మహిళా సర్వర్ వచ్చి అతడికి సర్ది చెప్పే ప్రయత్నం చేసింది.ఈ లోగా కోపంతో ఊగిపోతున్న అతడు.

Telugu America, Female Server, Gun, Sandwich-Telugu NRI

తనతో తెచ్చుకున్న తుపాకి తీసుకుని విచక్షణా రహితంగా వారిపై కాల్పులు జరిపాడు, ఈ ఘటనలో ఒక మహిళ అక్కడికక్కడే చనిపోగా మరొక మహిళ తీవ్ర గాయాలపాలయ్యింది.గొడవ మొదలయిన సమయంలోనే హోటల్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు వచ్చేలోగానే అతడు గన్ ఫైర్ చేశాడు.దాంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసుకున్నారు.కాగా కేవలం శాండ్విచ్ లో క్రీమ్ లేదని గొడవ పడి మనిషిని చంపేయడం అమెరికాలో గన్ కల్చర్ ఏ స్థాయిలో ఉందనేది అర్థమవుతోందని గన్ కల్చర్ కి వ్యతిరేకంగా పోరాడుతున్న సంస్థలు ఆవేదన వ్యక్తం చేశాయి.

హత్య చేసిన అతడిని కటినంగా శిక్షించి మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube