అమెరికా: విద్యార్ధులకు జీతం చెల్లిస్తున్న స్కూల్...మంచి కాన్సెప్ట్ అంటున్న నెటిజన్లు..

అమెరికాలో ఓ స్కూల్ అన్ని స్కూల్స్ లా పిల్లలకు పాఠాలు చెప్పి పంపితే ఏముంది వారికి బరువు బాధ్యతలు, కష్టం కూడా తెలియాలంటూ ఓ అద్భుతమైన కాన్సెప్ట్ సిద్డం చేసుకుని స్కూల్ యాజమాన్యం అందరితో చర్చించి ఓ ఐడియాను అమలు చేసింది.ఈ విషయం తెలిసుకున్న పిల్లల తల్లి తండ్రులు కూడా సూపర్ అంటూ ఓకే చెప్పేశారు.

 America The School That Pays The Salaries Of The Students Netizens Who Say It Is-TeluguStop.com

ఆనోటా ఈ నోటా అమెరికా వ్యాప్తంగా ఈ విషయం తెలియడంతో అన్నీ స్కూల్స్ ఇదే పద్దతి ఫాలో అవుదామా అనే చర్చలలో ఉన్నాయట.ఇంతకీ ఈ అమెరికా స్కూల్ అంతగా ఏం చేసింది…వివరాలలోకి వెళ్తే.

కష్టం తెలిస్తే పని విలువ తెలుస్తుంది, పని విలువ తెలిస్తే డబ్బు విలువ తెలుస్తుంది, డబ్బు విలువ తెలిస్తేనే జీవితంలో ఎలా ముందుకు వెళ్ళాలో తెలుస్తుంది.అన్నిటికంటే సమాజంపై బాధ్యత తప్పకుండా తెలుస్తుంది.

అందుకే చిన్నతనం అంటే స్కూల్ స్థాయి నుంచే ఈ విలువలు తెలియజేయాలని భావించింది అమెరికాలోని మిన్నోసొటా రాష్ట్రంలో ఉన్న ఒక హెన్నెపిన్ అనే స్కూల్.అనుకున్నదే తడవుగా స్కూల్ లో పలు రకాల పనులు చేయిస్తోంది.

ఒక పక్క చదువు చెప్తూనే మరో పక్క స్కూల్ లో చిన్నా చితకా పనులు చేయిస్తూ పని చేసిన వారికి గంటకు 15 డాలర్ల జీతం కూడా ఇస్తోంది.అయితే ఈ ఆలోచన రావడానికి వెనుక కారణం లేకపోలేదు.

కరోనా కారణంగా సిబ్బంది ఎవరూ పనిచేయడానికి రావడం లేదని అయితే ఆ డబ్బులు ఏవో పిల్లలకి ఇస్తే వారికి కష్టపడి పనిచేసే తత్వం, సంపాదన మీద ఆలోచన, మంచి చెడూ, తల్లి తండ్రులు తమని చదివించడం కోసం ఎంత కష్ట పడుతున్నారో అన్నీ తెలుస్తాయని అందుకే పిల్లలతో చేయించే పనులు మాత్రమే చెప్తూ పని వారికి ఇచ్చే డబ్బులు పిల్లలకు ఇస్తున్నామని స్కూలు యాజమాన్యం తెలిపింది.అయితే ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఈ పద్దతి బాగుందంటూ స్కూల్ యాజమాన్యాన్ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు నెటిజన్లు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube