అమెరికా : డ్రీమర్స్ గుడ్ న్యూస్ వినే రోజు దగ్గరలోనే ఉందట...!!

అమెరికాకు తల్లి తండ్రులతో పాటు చిన్న వయసులోనే వలస వచ్చి అక్కడే పెరిగి పెద్ద వారు అయ్యి ఉద్యోగం సాధించినా సరే వారు మేజర్ లు అయితే అమెరికా పౌరులుగా పరిగణించబడరు వీరినే డ్రీమర్స్ అంటారు.గడిచిన కొన్నేళ్లుగా ఈ డ్రీమర్స్ ను అమెరికా పౌరులుగా గుర్తించాలంటూ కొన్ని స్వచ్చంద సంస్థలు ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి.

 America The Day Of Hearing The Good News Of Dreamers Is Near , America, Development Relief And Education For Alien Minor, Indian Americans, Dreamers, Dr. Amy Bera, A Member Of The American Congress-TeluguStop.com

డ్రీమర్స్ కు చట్టబద్దమైన నివాస హక్కును కల్పించాలని 2001 లో డెవలప్మెంట్ రిలీఫ్ అండ్ ఎడ్యుకేషన్ ఫర్ ఏలియన్ మైనర్ అనే చట్టాన్ని రూపొందించి ఆ బిల్లును అమెరికా పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు.

అమెరికా గడ్డపై పుడితే ఆ పిల్లకు అక్కడి పౌరసత్వం వస్తుంది కానీ, పుట్టిన తరువాత అమెరికా తల్లి తండ్రులతో వెళ్తే వారు మేజర్లు అయ్యే వరకూ వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు.

 America The Day Of Hearing The Good News Of Dreamers Is Near , America, Development Relief And Education For Alien Minor, Indian Americans, Dreamers, Dr. Amy Bera, A Member Of The American Congress-అమెరికా : డ్రీమర్స్ గుడ్ న్యూస్ వినే రోజు దగ్గరలోనే ఉందట#8230;-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఇప్పటి వరకూ డ్రీమర్స్ గా అమెరికాలో ఉన్న వారి సంఖ్య లక్షల్లో ఉంటుందని అంచనా వేస్తున్నారు నిపుణులు.అంతేకాదు అమెరికాలో ఉన్న డ్రీమర్స్ లో అత్యధిక శాతం మంది భారతీయ అమెరికన్స్ పిల్లలే ఉన్నారట.

చట్టబద్దంగా అమెరికాలోకి వచ్చిన వలస వాసుల పిల్లలను రక్షించడానికి రెండు పార్టీలకు చెందిన సెనేటర్లు 2021 లో ఓ బిల్లును ప్రవేశపెట్టారు.అయితే.

మళ్ళీ ఈ బిల్లు చట్ట రూపం దాల్చే విధంగా ప్రతినిధుల సభలో మళ్ళీ సెనేటర్ల బలం కూడగట్టేందుకు డ్రీమర్స్ తల్లి తండ్రులు సెనేటర్లపై ఒత్తిడి తీసుకువస్తున్నారు.భారతీయ అమెరికన్స్ సెనేటర్ల మద్దతు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

ఈ బిల్లు చట్ట రూపం దాల్చే విధంగా కృషి చేయాలని అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు డాక్టర్ అమీ బేరా కోరారు.ఇదిలాఉంటే ఈ బిల్లుకు ప్రతిపక్ష రిపబ్లికన్లు కూడా అనుకూలంగానే ఉన్నారట.

కానీ చట్టబద్దంగా వచ్చిన వారికి మాత్రమె తాము మద్దతు ఇస్తామని అక్రమంగా అమెరికాలో ప్రవేశించిన వారి విషయంలో తమ వైఖరి మారదని స్పష్టం చేసారు.అన్నీ అనుకున్నట్టుగా జరిగితే అతి త్వరలో చట్టబద్ద డ్రీమర్స్ కు తప్పకుండా అమెరికా పౌరసత్వం వచ్చి తీరుతుందని అంటున్నారు పరిశీలకులు.

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube