అమెరికాలో తెలుగు ఎన్నారైల పరిస్థితి ఎలా ఉందంటే...!!!

అగ్ర రాజ్యం అమెరికాలో కరోనా సృష్టించిన విలయతాండవం అంతా ఇంతా కాదు.అమెరికాలో అతిపెద్ద నగరమైన న్యూయార్క్ సిటీ లో ఏకంగా కరోనా విరుచుకు పడింది.

 America, Telugu Nri, Work From Home, Jobs, Unemployment, Corona Effect-TeluguStop.com

ఇప్పటి వరకూ న్యూయార్క్ లో 4 వేల మంది చనిపోయి ఉంటారని అంచనా వేస్తున్నారు.అమెరికా వ్యాప్తంగా ఎక్కడికక్కడ పాలన స్తంభించి పోయింది.

అన్నీ మూతబడిపోయాయి.ఒక పక్క ఉద్యోగాలు ఉన్నాయా ఊడిపోయాయో తెలియని పరిస్థితి నెలకొంది.

ఈ సమాయంలో ఎంతో మంది టెకీలు ఇళ్ళ నుంచీ పనులు చేస్తున్నారు.ఈ క్రమంలో అమెరికాలో తెలుగు ఎన్నారైలు ఏమి చేస్తున్నారు.

వారి పరిస్థితి ఎలా ఉందంటే.
కరోనా ప్రభావంతో ఇళ్లకే పరిమితమై పోయిన ఎంతో మంది తెలుగు ఎన్నారైలు చాలా మంది ఇళ్ళ నుంచీ పనులు చేస్తున్నారు.

కొందరు ఉద్యోగాలు పోవడంతో ఏమి చేయాలో తెలియని ఆందోళనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.మరి కొందరి పరిస్థితి మరీ దారుణంగా ఉంది.తమ ఉద్యోగం ఎప్పుడు ఊడిపోతుందో అందుకు ప్రతిగా కంపెనీ నుంచీ మెయిల్స్ ఏమైనా వస్తాయోనని ఆందోళనతో బ్రతుకుతున్నారు.ఇదిలాఉంటే

Telugu America, Corona Effect, Jobs, Telugu Nri-

కొందరు ఒంటరి ఎన్నారైల పరిస్థితి మరీ దారుణంగా ఉంది.ఇంట్లో ఇద్దరు ఎన్నారైలు ఉన్నా వారికి ధైర్యం చెప్పేవారు లేక, సూచనలు, సలహాలు ఇచ్చే వారు కానరాక ఆందోళన చెందుతున్నారు.అసలు అమెరికా ఎందుకు వచ్చామా అని భాదపడుతున్న వారు అత్యధికంగా ఉన్నట్లుగా తెలుస్తోంది.

మరో కొందరు ఎన్నారైలు మాత్రం ఒకరి కొకరు గా ఇంట్లోనే ఉంటూ పని చేసుకుంటూనే వంటలు వండటం, కలిసి తెలుగు సినిమాలు చూడటం, తోట పని ఇలా కాలం వెళ్ళ దీస్తున్నారు.కానీ అధిక శాతం ఎన్నారైలు మాత్రం అమెరికా నుంచీ ఎప్పుడు ఇండియా వెళ్ళిపోదామా అనే ఆరాటాన్ని వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube