అమెరికాలో తెలుగువారికోసం...తానా ఇమ్మిగ్రేషన్ కాన్ఫరెన్స్ కాల్...!!!

అమెరికాలో కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి.వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్న నేపధ్యంలో యూనివర్సిటీలు, హాస్టల్స్ , మూతబడ్డాయి అమెరికాలోని తెలుగు వారు, తెలుగు విద్యార్ధులు ఎంతో మందని ఆర్ధిక ఇబ్బందులు పడుతున్నారు.

 America Tana Immigration Conference Call-TeluguStop.com

అంతేకాదు ఎంతో మందికి ఇమ్మిగ్రేషన్ పై ఎన్నో సందేహాలు కలుగుతున్నాయి.ఈ నేపధ్యంలో తెలుగువారికి ఇమ్మిగ్రేషన్ పై ఉన్న సందేహాలని నివృత్తి చేయడానికి ఉత్తర అమెరికా తెలుగు సంఘం ముందుకు వచ్చింది…

అమెరికాలో ఉంటున్న భారతీయులకి అలాగే తెలుగు వారికి ఇమ్మిగ్రేషన్ పై వస్తున్న సందేహాలని తీర్చడానికి అటార్నీతో ఓ కాన్ఫరెన్స్ కాల్ సమావేశాన్ని ఏర్పాటు చేసింది.

ఈ కార్యక్రమంలో కరోనా ఎంప్లాయిమెంట్ ఆధారైజేషన్ , రిమోట్ వర్క్ , 1-9 వెరిఫికేషన్ , ట్రావెల్ ఆంక్షలు ఇలా ప్రతీ విషయంలో వచ్చే సందేహాలని ఈ కాన్ఫరెన్స్ కాల్ ద్వారా పరిష్కరించనుంది.అయితే

ఈ సమావేశానికి , కాన్ఫరెన్స్ కాల్ లో మాట్లాడటానికి బిబిఐ లా గ్రూప్ కి చెందిన ఇమ్మిగ్రేషన్ అటార్నీ జనరల్ భాను బాబు ఇంద్రాలి పాల్గొననున్నారు.మార్చి 29వ తేదీ మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుందని, ఈ అవకాశాన్ని ప్రతీ ఒక్క భారతీయుడు, తెలుగువారు ఉపయోగించుకోవాలని తానా అధ్యక్షుడు జై తాళ్ళూరి ప్రకటించారు.Toll Free Number – 605-313-4100, PIN -695578#

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube