తానా ఎన్నికల ఓట్ల లెక్కింపు నేడే..!

అమెరికా తెలుగు సంఘం ఎన్నికలు ఈమధ్యనే జరిగాయి.వాటికి సంబందిచిన ఓట్ల లెక్కింపు ఈరోజు కొనసాగుతుంది.

 America Tana Election Results Today Voting Counting Started,latest-TeluguStop.com

తానా ఎన్నికల్లో మొత్తం 33,875 ఓట్లు ఉండగా 21 వేల ఓట్లు పోలయ్యాయి.వాటిలో 2800 వరకు చెల్లని ఓట్లుగా గుర్తించారు.

ఫైనల్ గా మరికొద్ది గంటల్లో తుది ఫలితాలు వెళ్లడవనున్నాయి.తానా ఎన్నికల కౌంటింగ్ లో పోస్టల్ బ్యాలెట్ లను లెక్కించి.

తర్వాత బ్యాలెట్ల బార్ కోడ్ సరి చూసుకుంటారు.ఆ తర్వాత మిషిన్ల ద్వాఅ బ్యాలెట్ లను తెరచి ఓట్లను లెక్కబెడతారని తెలుస్తుంది.

ఈ ఎన్నికల్లో శృంగవరపు నిరంజన్ గెలిచే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.ఈరోజు సాయంత్రం వరకు తానా ఫలితాలు రానున్నాయి.శృంగవరపు నిరంజన్, నరేష్ కొడాలి ప్యానెల్ ల మధ్య గట్టి పోటీ ఏర్పడింది.పోస్టల్ బ్యాలెంట్ల ద్వారా ఎన్నికల ప్రక్రియ కొనసాగింది.

అమెరికాలో ఉన్న తెలుగు వారి ఓటు ఎవరికి పడ్డది.ఈసారి తానా అధ్యక్ష పదవి ఎవరికి అన్నది మరికొద్ది గంటల్లో తెలుస్తుంది.నిరంజన్ ప్యానెల్ మాత్రం గెలుపుపై ధీమాగా ఉన్నారు.3 వేల పైగా మెజారిటీతో తాము గెలుస్తామని ఆ ప్యానెల్ సభ్యులు చెబుతున్నారు.తుది ఫలితాలు వస్తేనే కాని ఎవరు గెలిచారన్నది తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube