భారత్ కు అమెరికా స్ట్రాంగ్ వార్నింగ్..!!

అమెరికా అధ్యక్షుడిగా బిడెన్ ఇంకా ప్రమాణస్వీకారం చేయకుండానే అమెరికా భారత్ కు హెచ్చరికలు జారీ చేసింది.అమెరికా భారత్ ల మధ్య విలువైన భంధం ఉందని అన్ని విషయాలను పరిగణలోకి తీసుకోవాలని గుర్తు చేసింది.

 Warning To India, President Biden, Arms Purchase With Russia,   Christopher For-TeluguStop.com

రష్యాతో ఆయుధాల కొనుగోలు విషయాలను పక్కన పెట్టేయాలని ఆదేశాలు జారీ చేసింది.అయితే ఈ హెచ్చరికలు కేవలం భారత్ కు మాత్రమే కాదు మరి కొన్ని దేశాలకు కూడా చేసింది.

రష్యా నుంచి ఎస్-400 యాంటీ మిస్సైల్ వ్యవస్థను కొనుగోలు చేసినందుకు టర్కీ పై ఆంక్షలు విధించింది.

ఇంటర్నేషనల్ సెక్యూరిటీ అండ్ నాన్ ప్రోలిపిరేషణ్ అసిస్టెంట్ సెక్రెటరీ క్రిస్టోఫర్ ఫోర్డ్ చట్టం కింద టర్కీ కి చెందిన మిలటరీ ఆయుధాల సేకరణ సంస్థ ఎస్ఎస్బీ, అలాగే నలుగురు అధికారులపై ఆంక్షలు విధించింది.

ఈ ఘటన అన్ని దేశాలకు ఓ హెచ్చరిక లాంటిదని, భవిష్యత్తులో ఏ దేశం తమ ఆదేశాలకు భేఖాతరు చేసినా చర్యలు ఈ విధంగానే ఉంటాయని ప్రకటించింది.ఆయుధాల కొనుగోళ్ళు వెంటనే నిలిపివేయాలని లేకపోతే సిఏఏటీఎస్ఏ సెక్షన్ 231 కింద ఆంక్షలు విధించక తప్పదని తెలిపింది…ఇదిలాఉంటే

Telugu Arms Russia, Massiverussia, Biden, Missile System, India-Latest News - Te

భారత్ 2018 లోనే రష్యాతో ఆయుధాల కొనుగోలు ఒప్పందం కుడుర్చుకుంది .ఈ ఒప్పందంలో భాగంగా ఎస్-400 యాంటీ మిస్సైల్ వ్యవస్థల కోసం రూ.543 కోట్ల ఒప్పందం రష్యాకు-భారత్ ల మధ్య భారీ ఒప్పందం జరిగింది.ఈ ఒప్పందాన్ని అమెరికా వ్యతిరేకిస్తున్నా భారత్ మాత్రం వెనక్కి తగ్గేది లేదని తెగేసి చెప్తోంది.నూతన అధ్యక్షుడిగా త్వరలో ప్రమాణ స్వీకారం చేయనున్న బిడెన్ ఈ ఆయుధాల ఒప్పందంలో ఎలాంటి నిర్ణయం వెలిబుచ్చుతారోననే సందిగ్ధత నెలకొంది.

అయితే ప్రస్తుతం ఉన్న ఆయుధ ఒప్పందాన్ని చాలామంది డెమోక్రటిక్ నేతలు కూడా సమర్ధించారని ఒకవేళ బిడెన్ ఇందుకు అనుకూలం అయితే భవిష్యత్తులో అమెరికా భారత్ సంభంధాలు ఎలా ఉండబోతాయోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నిపుణులు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube