అమెరికా కీలక అధికారి సంచలన ప్రకటన..ఆధారాలు ఉన్నాయి..!!!

కరోనా మహమ్మారి అమెరికాని అల్లకల్లోలం చేస్తోంది.గంటల వ్యవధిలో వేలాది మంది మృత్యు వాత పడుతున్నారు.

 Corona Virus, America, Donald Trump, China, Wuhan, Lab, Mike, State Secretary, M-TeluguStop.com

చైనాలో పుట్టిన ఈ వైరస్ అన్ని దేశాలకంటే కూడా అమెరికాపై తీవ్రస్థాయిలో ప్రభావం చూపిస్తున్న విషయం విధితమే.దాంతో ప్రపంచ దేశాలన్నీ కరోనా పాపం చైనాదే అంటూ దుమ్మెత్తిపోశాయి.

ఇదిలాఉంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నేరుగానే చైనాపై విమర్శలు చేస్తున్నారు.నష్టపరిహారం ఇవ్వాలని కరోనా చైనాలోని వ్యూహాన్ ల్యాబ్ లోనే తయారయ్యిందని ప్రపంచం ముందు చైనాని బూచి చేసి చూపించారు.

ఈ క్రమంలోనే కరోనా వైరస్ చైనాలోని వ్యూహాన్ ల్యాబ్ లోనే పుట్టిందని చెప్పడానికి కీలక ఆధారాలు ఉన్నాయని అందుకు తగ్గ ఆధారాలు కూడా ఉన్నాయని అమెరికా స్టేట్ సెక్రటేరి మైక్ సంచలన ప్రకటన చేశారు.ప్రామాణిక ప్రయోగశాలలు నడిపిన చరిత్ర చైనాకి ఉందని.

ప్రస్తుతం ప్రపంచం మొత్తం దీనిపై దృష్టి సారించిందని అన్నారు.ముందుగానే చైనా ప్రపంచాని హెచ్చరించకుండా ఈ వైరస్ తో ప్రమాదం లేదనేలా వ్యవహరించిందని దాంతో ప్రపంచం మొత్తం తీవ్రస్థాయిలో నష్టపోయిందని అన్నారు.

Telugu America, China, Corona, Donald Trump, Mike, Secretary, Wuhan-

అమెరికా అధ్యక్షుడు గత కొంతకాలంగా ఈ వైరస్ పై మేము విచారణ చేపడుతున్నాం…చైనా మాకు సహకరించాలి అంటూనే ఉన్నారు.ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు అధికారులని రంగంలోకి దించామని చెప్తున్న ట్రంప్ నిజాలు నిగ్గు తేలుతాయని అదే నిజమైతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవడానికి చైనా సిద్దంగా ఉండాలని గతంలోనే హెచ్చరించారు.ఈ సందర్భంలో మైక్ ఆధారాల ఉన్నాయంటూ ప్రకటించడం సంచలనం సృష్టిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube