ఏప్రియల్ నుంచీ హెచ్ -1 బీ వీసాలో మార్పులు..  

అమెరికాలో ఉన్నత విద్యాసంస్థల నుంచి అడ్వాన్స్‌డ్ డిగ్రీలను పొందిన విదేశీ ఉద్యోగులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా ట్రంప్ ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. అందుకుగాను హెచ్ -1 వీసాలో మార్పులని చేపట్టనున్నట్టుగా కూడా తెలిపింది. అది కూడా ఏప్రియల్ నెల నుంచీ మొదలవనుంది. భారత్ ,చైనా మొదలగు దేశాలనుంచీ వచ్చే వారికంటే కూడా అమెరికా డిగ్రీలు ఉన్న వారికి అధిక ప్రాధాన్యతని ఇవ్వనున్నాట్టుగా తెలిపింది.

America Started Modifications In H1B Visa-

America Started Modifications In H1B Visa

ట్రంప్ ముందు నుంచీ ప్రతిభ ఆదారిత వలసలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని ముందు నుంచీ ప్రకటన ఇస్తూనే ఉన్నారు. ఈ ఆధారంగానే వీటి రూపకల్పన ఉంటుందని తాజాగా తెలుస్తోంది. అంతేకాదు అమెరికాలో చదివి డిగ్రీలు చదివిన వారు హెచ్ -1 బీ లాటరీలలో ఎంపిక అయ్యే అవకాశం ఉందని తెలిపారు.అయితే ఏప్రిల్‌ 1 నుంచి మొదలయ్యే హెచ్‌-1బీ 2020 సెషన్‌కు మాత్రం ఇది అందుబాటులోకి రాదు.

America Started Modifications In H1B Visa-

ఇదిలాఉంటే అమెరికాలో ప్రతీ ఏటా 65 వేల హెచ్-1బీ వీసాలు అందుబాటులో ఉంటుంటాయి వీటికి మరో 20 వేల వీసాలని అదనంగా అమెరికన్ కాలేజీలలో అడ్వాన్స్‌డ్ డిగ్రీలు పొందిన వారికి మాత్రమే కేటాయిస్తున్నారు. దీనినే మాస్టర్స్ క్యాప్ అని కూడా అంటారు. ప్రస్తుతం మాస్టర్స్ క్యాప్ లాటరీని తొలుత నిర్వహిస్తున్నారు. ఈ లాటరీలో ఎంపిక కాలేనివారిని రెగ్యులర్ క్యాప్‌లో చేర్చి ర్యాండమ్ సెలెక్షన్ చేస్తారు.