20 లక్షల తుపాకులు కొన్న అమెరికన్స్..ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు..!!!

కరోనా వైరస్ కారణంగా ఇప్పటికే అమెరికన్స్ అందరూ భయాందోళనలకు లో నవ్వుతుంటే తాజాగా అమెరికాలో వెలుగుచూసిన ఓ వార్త అమెరికన్స్ ని మరింత భయభ్రాంతులకు గురి చేస్తోంది.సహజంగానే అమెరికాలో గన్ కల్చర్ ఎక్కువగా కనిపిస్తుంది స్కూల్ కి వెళ్లే పిల్లవాడి నుంచి ముసలి వాళ్ళ వరకు తుపాకులను వాడుతుంటారు.

 America, Social Workers, Gun Culture, School Children, Old People, Law Universit-TeluguStop.com

ఎన్నో స్వచ్ఛంద సేవా సంస్థలు, మానవ హక్కుల సంఘాలు అమెరికాలో గన్ కల్చర్ పై నిషేధం విధించాలని పోరాడుతూనే ఉన్నాయి అయితే ఊహించని విధంగా అమెరికాలో ఒక్క మార్చి నెలలో 20 లక్షల తుపాకులు కొనుగోలు అయ్యాయనే వార్త అందరినీ కలవరపెడుతోంది లక్షలాది మంది పౌరులు తుపాకులను కొనుగోలు చేశారని ఇది 2013 జనవరిలో జరిగిన కొనుగోళ్ల కంటే కూడా రెండు రెట్లు అధిక స్థానంలో జరిగిందని తెలుస్తోంది.దాంతో ఈ పరిస్థితులు అమెరికా యంత్రాంగాన్ని కలవరపెడుతున్నాయి.

ఒకపక్క కరోనా వైరస్ ని ఎలా ఎదుర్కోవాలని సతమతమవుతున్న అధికారులు తాజాగా జరిగిన ఈ ఘటనతో తలలు పట్టుకుంటున్నారు.
ఈ పరిస్థితుల పై స్పందించిన కొందరు సామాజిక కార్యకర్తలు ఇన్ని తుపాకులు కొనుగోలు చేయడం కేవలం భయంతో మాత్రమే జరిగిందని అంటున్నారు.

ప్రస్తుతం కరోనా కారణంగా శాంతిభద్రతలు అదుపుతప్పాయని దాంతో సొంతగా మనుగడ సాధించేందుకు తుపాకీ అవసరమనే భావన పౌరులు ఉండవచ్చని లా యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ లిట్టర్ విశ్లేషిస్తున్నారు.ఏది ఏమైనా ఇంత భారీ మొత్తంలో తుపాకులు అమ్ముడుపోవడం వెనక బలమైన కారణం ఉండొచ్చని భావిస్తున్న ప్రభుత్వం ఈ ఘటనపై విచారణ చేపట్టాలని అధికారులని ఆదేశించినట్లుగా తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube