ఇదంతా ఎవరికోసం...ట్రంప్..????

అమెరికా చరిత్రలో ఇదొక దారుణమైన పరిణామం.34 రోజులుగా అమెరికా వ్యాప్తంగా షట్ డౌన్ నడుస్తోందంటే అక్కడి ఉద్యోగులు ఎంతటి దారుణమైన పరిస్థితిలో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.ఇదే విషయాన్ని మీడియా కోడై కూస్తున్న సరే ఇరు పార్టీలు తమ వైఖరిలో ఎలాంటి అడుగు ముందుకు వేయడం లేదు.అమెరికా చరిత్రలోనే ఇది అతిపెద్ద షట్ డౌన్ అంటున్నారు చరిత్ర కారులు.

 America Shut Down Goes 34 Its A Record In America-TeluguStop.com

అమెరికా-మెక్సికో సరిహద్దులో గోడ నిర్మాణానికి నిధులు ఎలాగైనా సరే తీసుకు రావాలనే ట్రంప్ పంతం అంత భారీ నిధులు ఇవ్వకుండా ఉండాలనే డెమోక్రాటిక్ పార్టీ పంతం మధ్యలో అమెరికా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.దాదాపు 8 లక్ష మంది ఫెరడల్‌ ఉద్యోగులు జీతాలు లేకుండా పని చేస్తున్న పరిస్థితి అగ్ర రాజ్యంలో నెలకొంది.

సరిహద్దు గోడ నిర్మాణం కోసం ట్రంప్ నిధులని రాబట్టడం సరైన నిర్ణయమే అంటూ కేవలం 7శాతం మంది ఓటర్లు మాత్రమే తమ అభిప్రాయాన్ని తెలిపారని , మార్నింగ్‌ కన్సల్ట్‌ పోల్‌ సంస్థ పేర్కొనగా ట్రంప్ పై ఏ మాత్రం వ్యతిరేకత ఉందొ అంటూ లోకల్ మీడియా సైతం ట్రంప్ చర్యలని ఎండగడుతోంది.ట్రంప్ నేను ప్రజలకి ఇచ్చిన మాట అంటుంటే ఆ ప్రజలే ఇప్పుడు ట్రంప్ వైఖరిపై వ్యతిరేకత చూపడం గమనార్హం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube