అగ్ర రాజ్యంలో భద్రత కరువయ్యిందా..?

కరోనా కారణంగా అమెరికాలో మారుతున్న పరిస్థితులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు స్థానిక ప్రజలు.ఈ నేపథ్యంలో పని పరిస్థితుల్లో కొరవడుతున్న భద్రతపై కార్మికులు ఆందోళన బాట పడుతున్నారు.

 America, Corona, Donald Trump,corona Effect, Doctors, Workers-TeluguStop.com

ఒక వైపు పెరుగుతున్న పని ఒత్తిడి పై వ్యతిరేకత వ్యక్తం చేస్తూ అత్యవసర పనులను పక్కన పెట్టాలని వైరస్ ని ఎదుర్కొనేందుకు అవసరమైన అన్ని రకాల వనరులను సమకూర్చాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

ప్రస్తుతం ఎటువంటి రక్షణ లేకుండా కీలకమైన సేవలందిస్తున్న నర్సులు ,ఆరోగ్య కార్యకర్తలు, అమెజాన్ పోస్టల్ కార్మికులు, ఫుడ్ ప్రాసెసింగ్ ,సేవా రంగాలకు, చెందిన కార్మికులు సమ్మెబాట పడుతూ ఆందోళనలు చేపడుతున్నారుఇదిలా ఉంటే కార్మికులు తిరిగి విధులలో చేరేలా వారిపై ఒత్తిడి పెంచేందుకు అమెరికా ఇతర దేశాల ప్రభుత్వాలతో కలిసి ఓ కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది.

ఈ వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో కార్మికుల ప్రాణాలను సైతం పెట్టేందుకు అమెరికా సిద్ధంగా ఉందనే విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి.

Telugu America, Corona, Corona Effect, Doctors, Donald Trump-

ఈ నేపథ్యంలో ట్రంప్ శ్వేత సౌధంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పనులకు రాని వారికి కూడా తమ వేతనాలు చెల్లిస్తామని ఇలాంటి సమయంలో విధులు సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు మరొకవైపు విధి నిర్వహణలో తమకు పూర్తి స్థాయిలో భద్రత కల్పించాలని కోరుతూ ఎమర్జెన్సీ మెడికల్ వర్కర్లు ఇటీవల కాలంలో వాకౌట్ చేయడం తో స్పందించిన ఆరోగ్య మంత్రి ఆరోగ్య పరిరక్షణ వర్కర్ల భద్రత కోసం 5 వేల డాలర్లు చెల్లించేందుకు సుముఖత వ్యక్తం చేశారు .ఈ క్రమంలోనే దాదాపు పది వేల మంది నిర్మాణరంగ కార్మికులు, కార్పెంటర్ లు సోమవారం సమ్మె బాట పట్టారు.అయితే ప్రభుత్వాలు కార్మికులకు ఇచ్చే రక్షణపై పూర్తిస్థాయి హామీ ఇస్తే తప్పకుండా వారందరూ ప్రభుత్వానికి సహకరిస్తారని నిపుణులు సూచిస్తున్నారు

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube