అమెరికాలో డేంజర్ బెల్స్...3300 మంది ఖైదీలకి కరోనా...!!!

కరోనా పేరు చెప్తే అమెరికా మొత్తం కంగారు పడిపోతోంది.కరోనా నుంచీ మెల్ల మెల్లగా కోలుకుంటున్న అమెరికా తాజాగా పరిణామాలతో ఒక్క సారిగా ఉలిక్కి పడింది.

 Corona Positive, America, Prisoners, Jailers, Trump-TeluguStop.com

ఇప్పటికే 80 వేల మంది అమెరికా వ్యాప్తంగా మృత్యువాత పడగా దాదాపు 13 లక్షల మంది ప్రజలు కరోనా బారిన పడి ఆందోళన చెందుతున్నారు.తాజాగా అమెరికా వ్యాప్తంగా ఉన్న జైళ్లలోని ఖైదీలకి కరోనా సోకిందని తెలియడంతో ఊహించని ఈ పరిణామంతో షాక్ అయ్యిపోయింది ప్రభుత్వ యంత్రాంగం.

అమెరికాలో ఉన్న అన్ని జైళ్లలో కలిపి దాదాపు 70 శాతం మంది ఖైదీలకి కరోనా సోకినట్టుగా తెలుస్తోంది.సెంట్రల్ కాలిఫోర్నియా జైలులో ఉన్న ఖైదీలకి కరోనా పరీక్షలు చేశారు.

అందులో దాదాపు 800 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది.అంతేకాదు అక్కడి జైలులో ఉద్యోగులు 11 మందికి కూడా కరోనా పాజిటివ్ అని తేలడంతో ఒక్క సారిగా అమెరికా వ్యాప్తంగా తీవ్ర ఆందోళన నెలకొంది.

Telugu America, Corona, Jailers, Prisoners, Trump-

ఈ పరిస్థితుల నేపధ్యంలో నష్ట నివారణ చర్యలు చేపట్టిన అధికారులు.ఖైదీలకి చికిత్స అందించేందుకు జైలులోనే మిలటరీ ఆసుపత్రి నిర్మించారు.టర్నినల్ ఐ ల్యాండ్ ఇన్స్టిట్యూట్ లో కూడా ఖైదీలకి పరీక్షలు చేయగా వారిలో సుమారు 650 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్టుగా తేలింది.ఇప్పటి వరకూ అమెరికాలో ఉన్న అన్ని జిల్లాలో కలిపి దాదాపు 3300 మందికి కరోనా పాజిటివ్ నమోదు అయ్యిందని అధికారులు వెల్లడించారు.

కరోనా తగ్గుముఖం పడుతున్న సమయంలో మళ్ళీ ఇలాంటి పరిస్థితులు ఎదురు కావడంతో తలలు పట్టుకుంటున్నారు అధికారులు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube