బిడెన్ వైపే అమెరికా ప్రజల మొగ్గు....ప్రస్తుత పరిస్థితి ఏమిటంటే..!!!

అమెరికా అధ్యక్ష ఎన్నికలు అయ్యిపోయాయి.ఎదురు చూసినంత సేపు పట్టలేదు అమెరికన్స్ ఓట్లు వేయడానికి.

 Americans Supporting Joe Biden, Joe Biden, America Presidential Elections, Donad-TeluguStop.com

ఇక ఎవరు అధికారాన్ని చేపడుతారు అనే సందిగ్ధతే మిగిలి ఉందని అనుకున్న క్షణంలోనే బిడెన్ వైపు అమెరికన్స్ మొగ్గు చూపారు అని ఓట్ల లెక్కింపు చెప్పేస్తోంది.ప్రస్తుతం ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది.

ఊహించిన విధంగానే, సర్వేలు తేల్చి చెప్పినట్టుగానే బిడెన్ ట్రంప్ పై ఆధిక్యత కనబరుస్తున్నారు.ట్రంప్ ఊహలకు అందని విధంగా బిడెన్ దూసుకుపోతున్నారు.

ఇప్పటి వరకూ లెక్కించిన ఓట్ల లెక్కల ప్రకారం చూస్తే.

బిడెన్ కు 119, ట్రంప్ కు 92 ఎలక్టోరల్ ఓట్లు వచ్చాయి.

అత్యంత కీలక రాష్ట్రాలుగా విజయావకాశాలను డిసైడ్ చేసే రాష్ట్రాలు గా పేరొందిన పెద్ద రాష్ట్రాలు బిడెన్ కి దాసోహం చెప్తున్నాయి.పెన్సిల్వేనియా, బెర్మాంట్, న్యూజెర్సీ, మేరీ ల్యాండ్, రోడ్ ఐల్యాండ్, రాష్ట్రాలలో బిడెన్ విజయం సాధించడంతో పాటుగా టెక్సాస్, కాన్సాస్ వంటి రాష్ట్రాల్లో బిడెన్ ముందు వరుసలో ఉన్నారు.

ట్రంప్ ఇండియానా, ఒక్లాహం, కెంటకీ, వర్జీనియా, సౌత్ కరోలినా, లలో విజయకేతనం ఎగురవేశారు.ఫ్లోరిడా, జార్జియా రాష్ట్రాలలో ముందు వరసలో ఉన్నారు.


Telugu America, Americansjoe, Donadl Trump, Electoral Votes, Joe Biden, Votes-Te

ఇదిలాఉంటే అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించాలంటే మొత్తం 270 ఎలక్టోరల్ ఓట్లు సాధించాల్సి ఉంటుంది.అమెరికా వ్యాప్తంగా ఉన్న 50 రాష్ట్రాలకు గాను మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లు ఉంటాయి.వీటిలో ఎవరైతే 270 ఎలక్టోరల్ సాధిస్తారో వారే అధ్యక్షుడిగా ఎన్నికవుతారు.దాంతో ఇప్పుడు అత్యధిక 270 ఎలక్టోరల్ ఓట్లు ఉన్న రాష్ట్రాలు కీలకం కానున్నాయి.అలాంటి రాష్ట్రాలు మొత్తంగా 6 ఉండగా వాటిలో బిడెన్ ఇప్పటికే 3 రాష్ట్రాలలో విజయ కేతనం ఎగుర వేశారు.దాంతో బిడెన్ కాబోయే అధ్యక్షుడు అవుతారని డెమోక్రటిక్ పార్టీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు.

ఇకా ఓట్ల లెక్కింపు కొనసాగుతోందని తుది ఫలితాలు వచ్చే వరకూ వేచి చూడాలని బిడెన్ సహచరులకు ఆదేశించినట్టుగా తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube