కరోనా దేవుడిచ్చిన వరం అంటున్న ట్రంప్..!

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోమారు వింత వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు.గతంలో అనేక సందర్భాల్లో విచిత్రమైన వ్యాఖ్యలు చేసి విమర్శల పాలైన ట్రంప్ తాజాగా కరోనా గురించి చేసిన వ్యాఖ్యల గురించి సోషల్ మీడియా వేదికగా పెద్దఎత్తున చర్చ జరుగుతోంది.

 America President Trump Says Catching Covid 19 Was Blessing God , Coronavirus, A-TeluguStop.com

తాజాగా ట్రంప్ కరోనా వైరస్ దేవుడిచ్చిన వరమని వ్యాఖ్యలు చేశారు.కొన్ని రోజుల క్రితం ట్రంప్, ఆయన భార్య మెలానియా ట్రంప్ కరోనా బారిన సంగతి తెలిసిందే.

74 సంవత్సరాల వయస్సులో 110 కిలోల బరువు ఉన్న ట్రంప్ కరోనా బారిన పడటంతో చాలామంది ఆయన కోలుకోవడం కష్టమేనని భావించారు.ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి.

అయితే ట్రంప్ మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తూ మూడే మూడు రోజుల్లో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు.కోలుకున్న తరువాత ట్రంప్ ఒక వీడియోను విడుదల చేసి ఆ వీడియో ద్వారా విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు.

గతంలో ట్రంప్ కరోనా సాధారణ ఫ్లూ లాంటిదేనని వ్యాఖ్యలు చేసి నెటిజన్ల చేత చీవాట్లు తిన్న సంగతి తెలిసిందే.ప్రస్తుతం ట్రంప్ తాను కరోనాను “దేవుని ఆశీర్వాదం”గా భావిస్తున్నట్టు చెప్పుకొచ్చారు.

తాను కరోనా చికిత్స కోసం రెజెనెరాన్ ఫార్మాస్యూటికల్స్ మందులు వినియోగించానని ఆ మందులు వైరస్ పై ఎంతో ప్రభావవంతంగా పని చేసి తాను త్వరగా కరోనా వైరస్ నుంచి కోలుకోవడానికి కారణమయ్యాయని వెల్లడించారు.

ట్రంప్ తనకు చికిత్స అందించిన వైద్యులపై ప్రశంసల వర్షం కురిపించారు.

అనంతరం ప్రపంచ దేశాలకు కరోనా వ్యాప్తికి కారణమైన చైనాపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.కరోనా వైరస్ కు అమెరికన్లు డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని.వైరస్ వ్యాప్తికి కారణమైన డ్రాగన్ భారీ మూల్యం చెల్లించక తప్పదని పేర్కొన్నారు.మరికొన్ని రోజుల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ట్రంప్ ఎన్నికల ప్రచారంలో తీరిక లేకుండా గడుపుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube