అమెరికా అధ్యక్షుడికే దిక్కులేదు !   America President Phone Calls Tamparing By Chaina Russia     2018-10-26   20:49:22  IST  Sai M

అమెరికా పేరు చెబితే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని దేశాలు వణుకుతాయి. అందుకే అమెరికాకు అగ్ర రాజ్యం అని పేరు కూడా ఉంది. అలాంటి దేశానికి అధ్యక్షుడు అంటే మాటలా ..? ఎంత సెక్యూరిటీ ఎంత హంగామా ఉంటుంది..? కానీ ఇప్పుడు ఆ అమెరికా అధ్యక్షుడు డొనాల్ ట్రంప్‌కూ ఓ కష్టం వచ్చి పడింది. అయనకు ఫోన్ ట్యాపింగ్ సమస్య తప్పట్లేదా? అంటే అవుననే అంటోంది ‘న్యూయార్క్ టైమ్స్’ పత్రిక. ఈ మేరకు ఓ కథనాన్ని ప్రచురించింది.

అమెరికా నిఘా వర్గాల సమాచారం మేరకు.. ట్రంప్ ఫోన్‌కాల్స్‌ను చైనా, రష్యా ట్యాపింగ్ చేస్తున్నాయి. ఆయన ప్రతి మాటనూ ఆ రెండు దేశాలు వింటున్నాయని తమకు తెలిసిందని ఈ ప్రత్యేక కథనంలో వెల్లడించింది. నేరుగా ఎవరితోనూ ఫోన్‌లో మాట్లాడకూడదని, ఇది భద్రతాపరమైన సమస్యలను కొనితెస్తుందని నిఘా వర్గాలు వెల్లడించినా ట్రంప్ పట్టించుకోవట్లేదట. దాంతో ఆయన సంభాషణలను రష్యా, చైనాలు యథేచ్ఛగా వినగలుగుతున్నాయని తెలిపింది. ట్రంప్ వాడే ఐఫోన్ వివరాలు అనేక మంది అధికారులకు, మాజీ అధికారులకు కూడా తెలుసునని కూడా వివరించింది. ఇలాంటి పరిస్థితుల్లో రష్యా, చైనా గూఢచారులు పని సులువవుతోందని తెలిపింది.