అమెరికా : 24 గంటలు గడవలేదు.. పాపం బైడెన్, ‘‘మతిమరుపు’’తో మళ్లీ విమర్శల పాలు

జీవితంలో జరిగే కొన్ని సంఘటనల నుంచి మనిషి పాఠాలు నేర్చుకోవాలని పెద్దలు తరచుగా చెబుతూ వుంటారు.ఈ మాట విన్న వారు బాగుపడితే.

 America President Joe Biden Mocked For Trying To Shake Hands With Us Official Tw-TeluguStop.com

పట్టించుకోని వారు లేనిపోని ఇబ్బందుల్లో పడటమే కాదు.నలుగురిలో నవ్వుల పాలు కూడా అవుతారు.

అచ్చం రెండో కోవలోకే వస్తారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. లేటు వయసులో ప్రపంచంలోనే శక్తివంతమైన దేశానికి అధ్యక్షుడిగా బైడెన్ పగ్గాలు చేపట్టారు.

ట్రంప్ హయాంలో పోయిన అమెరికా కీర్తి ప్రతిష్టలను తిరిగి పునరుద్దరిస్తానన్న హామీతో బాధ్యతలు అందుకున్న జో బైడెన్ .తన తీరుతో తాను నవ్వుల పాలవ్వడమే కాకుండా, దేశానికి సైతం చెడ్డ పేరు తీసుకొస్తున్నారు.

వయోభారం, అనారోగ్యంతో ఇబ్బంది పడుతోన్న జైడెన్.మొన్నామధ్య కమలా హారీస్‌ను ప్రెసిడెంట్ హ్యారీస్ అంటూ టంగ్ స్లిప్పయ్యారు .అంతేకాదు మంత్రుల పేర్లు, వారి హోదాలను సైతం ఆయన చెప్పలేక తడబడ్డారు.తర్వాత అమెరికన్ కాంగ్రెస్‌ను ఉద్దేశిస్తూ ప్రసంగించిన ఆయన.రష్యా – ఉక్రెయిన్ సమస్య గురించి ప్రస్తావించారు.ఈ క్రమంలో ఉక్రెయిన్ అనాల్సిందిపోయి ఇరాన్ అంటూ వ్యాఖ్యానించి పరువు పొగొట్టుకున్నారు.

ఇలా ఒకటి కాదు రెండు కాదు.బైడెన్ అభాసుపాలైన సందర్భాలు కోకొల్లలు.

Telugu Jill Biden, Joe Biden, Official, Senate Chuck-Telugu NRI

నిన్న గాక మొన్న కూడా.హెలికాఫ్టర్ దిగి వస్తూ సూట్ జాకెట్ వేసుకునేందుకు బైడెన్ ప్రయత్నించారు.కానీ దానిని వేసుకోవడానికి ఆపసోపాలు పడ్డారు.చివరికి భార్య జిల్ బైడెన్ సాయం చేయడంతో కోటును తొడుక్కోగలిగారు.సరిగ్గా ఇదే సమయంలో తాను ధరించిన కళ్లజోడు కిందపడటంతో మళ్లీ దానిని తీసుకునేందుకు వంగాల్సి వచ్చింది.ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

దీనిని చూసిన నెటిజన్లు, విపక్ష సభ్యులు జో బైడెన్‌పై ట్రోలింగ్ చేస్తున్నారు.అయితే 24 గంటలు గడవకముందే మరోసారి నవ్వుల పాలయ్యారు అమెరికా అధ్యక్షుడు.

Telugu Jill Biden, Joe Biden, Official, Senate Chuck-Telugu NRI

చిప్స్ అండ్ సైన్స్ చట్టంపై సంతకం చేసే సందర్భంగా సెనేట్ మెజారిటీ నేత చక్ షుమెర్ అక్కడున్న వారందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చారు.బైడెన్‌కి కూడా ఇచ్చి, పక్కకు జరిగారు.సరిగ్గా ఇదే సమయంలో బైడెన్ మతిమరుపు బయటపడింది.అప్పటికే తనుకు షుమెర్ షేక్ హ్యాండ్ ఇచ్చిన విషయం మరిచిపోయిన పెద్దాయన.మరోసారి కరచాలనం కోసం చేయి ఇచ్చారు.ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

దీనిపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube