బిడెన్ మార్క్ పాలన...మొదటిరోజే కీలక నిర్ణయాలు..!!- America President Joe Biden Cancels 1776 Commission

Joe Biden Moves to Cancel 1776 Commission , America New president Joe Biden , 1776 Commission ,Joe Biden new Rules - Telugu 1776 Commission, America New President Joe Biden, Joe Biden Moves To Cancel 1776 Commission, Joe Biden New Rules

అమెరికా అధ్యక్షుడిగా ఇలా ప్రమాణ స్వీకారం చేశారో లేదో అప్పుడే బిడెన్ పాలనను పరుగులు పెట్టిస్తున్నారు.బాధ్యతలు నిర్వహించడంలో 78 ఏళ్ళ వయసు తనకు అడ్డురాదనే ధైర్యంతో బరిలోకి దిగిన బిడెన్ ఎట్టకేలకు తన మార్క్ పాలనను అమెరికా ప్రజలకు చూపిస్తున్నారు.

 America President Joe Biden Cancels 1776 Commission-TeluguStop.com

గతంలో ఉపాధ్యక్షుడిగా పనిచేసినా, అధ్యక్షుడిగా తానేంటో నిరూపించుకునెందుకు సిద్దంగా ఉన్నారు.ఇదిలాఉంటే ప్రమాణ స్వీకారం తరువాత బిడెన్ పలు కీలక నిర్ణయాలపై సంతకాలు చేశారు.

ట్రంప్ హయాంలో ఏ నిర్ణయాలపై ఆంక్షలు విధించారో వాటిని మళ్ళీ పునఃప్రారంభం చేస్తూ బిడెన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు.వాటిలో ఇమ్మిగ్రేషన్ , పారిస్ ఒప్పందం, కరోనా మహమ్మారి, ఇలా పలు కీలక అంశాలు ఉన్నాయి.

 America President Joe Biden Cancels 1776 Commission-బిడెన్ మార్క్ పాలన…మొదటిరోజే కీలక నిర్ణయాలు..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అందులో ముఖ్యంగా అమెరికాకు ప్రస్తుతం అత్యంత అవసరమైన కరోన మహమ్మారిని తరిమికొట్టే అంశం ప్రధానంగా ఉంది.ప్రతీ పౌరుడు విధిగా 100 రోజుల పాటు మాస్క్ తప్పనిసరిగా ధరించి తీరాల్సిందేనని తెలిపారు.

అలాగే ప్రతీ ఒక్కరికి వ్యాక్సిన్ అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకునేలా ప్రణాలికలు సిద్దం చేశారు.

పారిస్ ఒప్పందం ( పర్యావరణ మార్పులు ఒప్పందం) , ప్రపంచ ఆరోగ్య సంస్థలలోకి మళ్ళీ చేరారు.

ఉద్యోగులు పనిచేసే చోట లింగ వివక్ష ఉండ కూడదని అందుకు తగ్గట్టుగా ఉత్తర్వులు జారీ చేశారు.అత్యంత వివాదాస్పదమైన “1776 కమిషన్ “ ( అమెరికా చరిత్రలో నల్లజాతీయుల పాత్ర ) ను రద్దు చేశారు.

అలాగే ముస్లిం దేశాలపై రాకపోకల నిషేధాలను ఎత్తేశారు.ఋణాల చెల్లింపుల పై మారటోరియం విధించారు.

అంతేకాదు విద్యార్ధి ఋణాల చెల్లింపులు సెప్టెంబర్ 30 దాకా నిలిపేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

#1776 Commission #JoeBiden #AmericaNew #JoeBiden

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు